దృష్టి లోపాల నివారణే వైయస్సార్ కంటి వెలుగు లక్ష్యంః తమ్మినేని

by సూర్య | Fri, Oct 11, 2019, 07:57 PM

దృష్టి లేకపోతే సృష్టిని కనిపించదని, అటువంటి దృష్టి లోపాలను నివారించేందుకు డాక్ట‌ర్ వైయస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించడం జరిగిందని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ పేర్కొన్నారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వై.యస్.ఆర్.కంటి వెలుగు కార్యక్రమాన్ని శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి గురువారం ఉద‌యం లాంఛనంగా ప్రారంభించారు. చిన్నారులు, పెద్దలలో దృష్టి లోపాలను నివారించుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వై.యస్.ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా శాసనసభాపతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కోసం మంచి కార్యక్రమాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. దృష్టి లేకపోతే సృష్టి కనిపించదని, అటువంటి దృష్టిలోపాలను గుర్తించి వారికి అవసరమైన చికిత్సను అందించడమే డా.వై.యస్.ఆర్.కంటి వెలుగు కార్యక్రమం లక్ష్యమని స్పష్టం చేశారు. ”సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అనే నానుడి ఉందని, అందులో భాగంగా  ఈ పథకం క్రింద ఆరు రకాల నేత్ర పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.560 కోట్లను ఖర్చు చేస్తోందని వివరించారు. చాలా మందికి కంటి చూపు లేకపోవడంతో తమ జీవితాలు నాశనం అవుతున్నాయని, ఈ పథకం ద్వారా జిల్లాలోని ప్రతీ ఒక్కరూ తమ దృష్టి లోపాలను సరిచేసుకోవచ్చని, అవసరమైతే శస్త్రచికిత్సలను ఉచితంగా పొంది, అవసరమైన కంటి అద్దాలు, మందులను కూడా ఉచితంగా పొందవచ్చని అన్నారు. డా. వై.యస్.ఆర్.ఆరోగ్యశ్రీ పథకంలో వెయ్యి రూపాయలు పైబడిన వాటికి  కార్పొరేట్ వైద్యాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యకర సమాజంతో దేశంలో సంపద సృష్టి పెరుగుతుందని పేర్కొన్నారు. 2020 జనవరి 26 నుండి అమ్మఒడి పథకం అమలుకానుందని శాసనసభాపతి వివరించారు. కంటి వెలుగు ద్వారా ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకోవాలని, కంటి వెలుగు అమలులో రాష్ట్రంలో అగ్ర స్థానంలో ఉండాలని శాసనసభాపతి ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలుచేస్తొన్న నవరత్నాలలో సైతం జిల్లా అగ్ర స్థానంలో ఉండాలని, ఇందుకు అధికారులు, ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం సి.ఎం.రిలీఫ్ ఫండ్ క్రింద ఎస్.సరస్వతికి చెక్ ను, వైద్య సిబ్బందికి కంటి వెలుగు కిట్లను మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి పంపిణీ చేశారు.

Latest News

 
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM
పిఠాపురం ఎన్నికల బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి.. చదువు, ఆస్తులెంతో తెలుసా Fri, Apr 26, 2024, 07:43 PM
ఏపీలో ఆ పార్టీకి షాక్.. అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ Fri, Apr 26, 2024, 07:39 PM
కాకినాడ ఎన్నికల బరిలో కిలాడి టీ టైమ్ శ్రీనివాస్ Fri, Apr 26, 2024, 07:34 PM