15న నెల్లూరులో ‘రైతు భరోసా’ పథకం ప్రారంభం

by సూర్య | Fri, Oct 11, 2019, 07:53 PM

రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో ‘రైతు భరోసా’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన రైతులందరూ రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్‌ లింక్‌ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. సీఎం వైఎస్‌ జగన్‌ తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారని వెల్లడించారు. రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే తెలుగు గంగ అధికారులతో చర్చించి.. తెలుగు గంగ పరివాహక ప్రాంత రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు.

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM