మిథాలిరాజ్ అరుదైన ఘనత

by సూర్య | Fri, Oct 11, 2019, 06:32 PM

మొట్టమొదటి సారి అంతర్జాతీయ వన్డేక్రికెట్ లో ప్రవేశించి ఐర్లాండ్పై 114 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచిన భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి మిథాలిరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో రెండుదశాబ్దాల కెరీర్‌ను పూర్తి చేసుకుంది. భారత క్రీడారంగంలో అత్యున్నతమైన అర్జున అవార్డు 2003లొ అందుకున్న మిథాలి రాజ్ సగంకంటే ఎక్కువ జీవితం క్రికెట్‌ మైదానాల్లోనే గడిపిన రికార్డులు కొల్లగొడుతూ వచ్చింది. వారధిగా రెండు దశబ్దాలకి నిలుస్తూ వచ్చిన  మిథాలీ రాజ్ ని కొందరు అభిమానంతో ‘లేడీ సచిన్‌’ అని పిలుచుకుంటారు. ప్రపంచకప్‌లో 15 ఏళ్ల వయసులోనే మిథాలి రాజ్ భారతజట్టులోకి అడుగు పెట్టింది. తన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాజీవితంలో భారతజట్టుకు 93వన్డేలలో ప్రాతినిధ్యం వహించి 2 సెంచరీలు, 20 అర్థ సెంచరీలు సాదించింది. అప్పట్లో ఐదువన్డేల సిరీస్‌లో ఆడిగెలిచిన తర్వాత మరో ఆరు నెలల వరకు ఇంకో సిరీస్‌ ఉండకపోవడం వల్ల మరిన్ని మ్యాచ్‌లు ఆడే  అవకాశం లేకపోయింది.ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కెరీర్‌ ఆరంభంలో ముందుకు సాగుతూ,ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ,మహిళా జట్టు వారధిగా ఇరవైఏళ్లు అంతర్జాతీయ ఆటలో కొనసాగడం చాలా గర్వించ తగ్గ విషయం.


 

Latest News

 
ఏపీ ఎన్నికల్లో ఇదేం పైత్యం.. ఏ పార్టీకి ఓటేశారో చెబుతూ వీడియోలు, ఫోటో తీసుకున్నారు Tue, May 14, 2024, 09:23 PM
ఏపీలో ఓటు వేసేందుకు 900 కిమీ కష్టపడి రైల్లో వచ్చారు.. పోలింగ్ కేంద్రానికి వెళ్లినా, అయ్యో పాపం Tue, May 14, 2024, 09:16 PM
ఈవీఎంలలో పోలైన ఓట్లు ఎన్నిరోజులు ఉంటాయో తెలుసా Tue, May 14, 2024, 09:12 PM
కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని భార్యతో కలిసి సందర్శించిన పవన్ కళ్యాణ్ Tue, May 14, 2024, 09:07 PM
ఏపీలో ఆగని దాడులు.. తాడిపత్రి, చంద్రగిరిలో టెన్షన్.. టెన్షన్.. సీన్‌లోకి చంద్రబాబు Tue, May 14, 2024, 09:02 PM