ట్రంప్‌కు పనామా అద్యక్షుడు షాక్

by సూర్య | Sat, Aug 24, 2019, 07:24 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పనామా నూతన అధ్యక్షుడు లారెంటినో కార్టిజో గట్టి షాక్‌ ఇచ్చారు. మధ్య అమెరికాను తమ సొంత ప్రయోజనాలకు అడ్డాగా మార్చుకునేందుకు ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలను ఆయన తిప్పికొట్టారు. అమెరికా ఇమ్మిగ్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకునే ఇతర దేశాల వారిని విచారణ పూర్తయ్యే వరకూ పనామాలో ఉంచేందుకు సంబంధించిన ఒప్పందం జరుగబోతుందన్న అమెరికా మీడియా ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇది జరగని పని అని, తాము మీకు మూడో రక్షణ దేశం గా ఉండబోమని కార్టిజో కుండబద్దలు కొట్టారు. ఇది ఆచరణయోగ్యం కాదని నేను భావిస్తున్నాను, ఈ సమస్యపై మేం చాలా సృష్టంగా ఉన్నాం. అమెరికా కూడా అదేవిధంగా ఉంటుందని భావిస్తున్నాను అని పేర్కొన్నారు. ఈ అంశంపై మీడియా ప్రచారానికి అనుగుణంగా అమెరికా జాతీయ భద్రత కార్యదర్శి కెవిన్‌ మెక్‌అలినాస్‌ పనామాలో పర్యటించారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM