అమెజాన్ మంటలను అదుపుచేసేందుకు రంగంలోకి ఆర్మీ

by సూర్య | Sat, Aug 24, 2019, 07:19 PM

ప్రపంచంలోనే అతి పెద్ద అడవి అయిన అమెజాన్ గత కొన్ని రోజులుగా కాలి బూడిదవుతోంది. రికార్డు స్థాయిలో ఆ అర‌ణ్యం కాలిపోతున్న తీరు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఆ దేశాధ్య‌క్షుడు బొల్స‌నారో.. అడువుల్లో మంట‌ల్ని అదుపు చేసేందుకు ఆర్మీని పంపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలు రిలీజ్ అయ్యాయి. స‌హ‌జ‌సిద్ధ‌మైన అమెజాన్ వ‌ర్షార‌ణ్యాన్ని ర‌క్షించుకునేందుకు బొల్స‌నారో చ‌ర్య‌లు మొదలుపెట్టారు. యురోపియ‌న్ నేత‌ల నుంచి తీవ్ర వ‌త్తిడి రావ‌డంతో బ్రెజిల్ ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌కు శ్రీకారం చుట్టింది. అమెజాన్ అడువుల్లో మంట‌ల్ని ఆర్పితేనే లాటిన్ దేశాల‌తో వాణిజ్యం కొన‌సాగిస్తామ‌ని ఫ్రాన్స్‌, ఐర్లాండ్ దేశాలు అల్టిమేటం జారీ చేశాయి. దీంతో బ్రెజిల్ అధ్య‌క్షుడు కార్చిచ్చును అదుపు చేసేందుకు ఆర్మీని రంగంలోకి దింపారు. అమెజాన్ అడ‌వుల్లో గ‌త కొన్ని రోజులుగా సుమారు 2500 ప్ర‌దేశాల్లో అగ్నికీల‌లు ఎగిసిప‌డుతూనే ఉన్నాయి.

Latest News

 
సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా! Sat, Apr 27, 2024, 09:31 PM
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. సాయంత్రానికి టీడీపీలో చేరిక, నాలుగేళ్ల క్రితమే Sat, Apr 27, 2024, 09:22 PM
ఏపీ ఎన్నికల్లో ఆ సీటు కోసం అంతపోటీనా?.. యాభైమందికి పైగా పోటీ Sat, Apr 27, 2024, 09:21 PM
ఏపీలో కీలక నేత నామినేషన్ తిరస్కరణ.. ఆ చిన్న కారణంతోనే Sat, Apr 27, 2024, 09:09 PM
ఉండవల్లి శ్రీదేవికి గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఎంపీ టికెట్ దక్కని మహిళనేతకు సైతం Sat, Apr 27, 2024, 09:04 PM