గ్రహాంతరవాసుల సందేశాలా?

by సూర్య | Fri, Aug 23, 2019, 06:04 PM

ఈ విశ్వంలో మనం ఒంటరివాళ్లం కాదా? మనలాంటివారో.. మనకన్నా బుద్ధిజీవులో వేరే పాలపుంతల్లో గ్రహాల్లో ఉన్నారా? మనం వారికోసం అన్వేషిస్తున్నట్టే.. వారు మనకోసం సంకేతాలు పంపుతున్నారా? ఈ సందేహాలకు కారణం.. 2007 నుంచి గతపన్నెండేళ్ల కాలంలో ఎనిమిదిసార్లు భూమికి చేరిన ఫాస్ట్‌ రేడియో బరస్ట్స్‌(ఎఫ్‌ఆర్‌బీలు- అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే రేడియో సంకేతాలు). విశాల విశ్వంలో.. సుదూరతీరంలో.. కనురెప్పపాటులో మెరిసి మాయమయ్యే వెలుగులివి. కొంతకాలంగా ఇలాంటి ఎనిమిది సంకేతాలు మళ్లీమళ్లీ భూమికి చేరాయి.


వాటిని కెనడియన్‌ హైడ్రోజెన్‌ ఇంటెన్సిటీ మ్యాపింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ టెలిస్కోప్‌ ద్వారా గుర్తించారు. వీటిలో తొలి ఫాస్ట్‌ రేడియో బర్‌స్టను శాస్త్రజ్ఞులు 2007లో కనుగొన్నారు. తర్వాత అలా డజనుకుపైగా ఎఫ్‌ఆర్‌బీలను గుర్తించగా.. మళ్లీ మళ్లీ వచ్చినవి ఎనిమిది సంకేతాలు. వాటిలో ఒకదాని మూలం మన పాలపుంతకు సమీపంలోనే ఉన్న మరో పాలపుంతలో ఉన్నట్టు శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అయితే, అవి సహజంగా విశ్వంలో సంభవించే శక్తి పేలుళ్లా? లేక గ్రహాంతరవాసుల సందేశాలా? అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది.

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM