ఏపీకి షాక్.. ప్రతి నిర్ణయాన్ని కేంద్రానికి రాష్ట్రం చెప్పాల్సిందే

by సూర్య | Fri, Aug 23, 2019, 06:16 PM

పోలవరం రివర్స్ టెండరింగ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని కేంద్రం మరోసారి తప్పుపట్టింది. పోలవరంపై తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కేంద్రానికి రాష్ట్రం చెప్పాల్సిందేనని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. డబ్బులు చెల్లించేది కేంద్రమే కాబట్టి అన్నీ చెప్పి తీరాల్సిందేనని అన్నారు. రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటుంటే కేంద్రం ఊరుకోబోదన్నారు. కాగా, కేంద్రం ఆశీస్సులతోనే ఈ పనులన్నీ చేస్తున్నామంటున్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి సీరియస్ అయ్యారు. సమాఖ్య వ్యవస్థలో ఎవరి ఆశీస్సులు ఎవరికీ ఉండవని తేల్చి చెప్పారు. రాష్ట్రం, కేంద్రం ఎవరి పని వారు చేసుకుంటూ పోవాల్సిందేనని అన్నారు. పోలవరం అథారిటీ నుంచి దీనిపై నివేదిక కోరామన్నారు. నివేదిక వచ్చిన తర్వాత పోలవరంపై తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత ఉన్నంత మాత్రాన రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీలులేదని కేంద్రమంత్రి పునరుద్ఘాటించారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM