డైమండ్స్ పార్క్ లో డిమాండ్ సాధించిన యువతి

by సూర్య | Thu, Aug 22, 2019, 04:18 PM

యూట్యూబ్ వీడియోను చూసి ఓ వజ్రాన్ని దొరకబుచ్చుకుందో మహిళ. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. టెక్సాస్ లోని అర్కన్సాస్ క్రేటర్ ఆఫ్ డైమండ్స్ పార్కులో మిరండా(27) అనే యువతి వజ్రాల కోసం వేట ప్రారంభించింది. ఈ పార్కులో వజ్రాలు, విలువైన రాళ్లు దొరికితే దాన్ని తమ వెంట తీసుకెళ్లిపోవచ్చు. ఈ నేపథ్యంలో డైమండ్ పార్కుకు చేరుకున్న యువతి మిరండా..యూట్యూబ్ ను తెరిచింది. వజ్రాన్ని ఎలా వెతకాలో వీడియో చూడటం ప్రారంభించింది.


‘నేను నీడలో కూర్చుని వీడియో చూస్తున్నా. ఈ సందర్భంగా అక్కడే ఆడుకుంటున్న నా పిల్లాడివైపు తలెత్తి చూశా. ఆ తర్వాత మొబైల్ ఫోన్ లో వీడియో చూడబోతుండగా, పసుపుపచ్చ రంగులో ఓ రాయి మెరుస్తూ కనిపించింది. దాన్ని బయటకు తీయగానే అది వజ్రమని అర్థమయింది’ అని మిరండా చెప్పింది. ఈ 3.72 క్యారెట్ల వజ్రాన్ని తాను అమ్మబోననీ, డైమండ్ రింగ్ చేయించుకుంటానని యువతి తెలిపింది. కాగా, 2013 తర్వాత ఇంత పెద్ద పసుపుపచ్చ వజ్రం లభించడం ఇదే తొలిసారని డైమండ్ పార్క్ వర్గాలు తెలిపాయి.

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM