సీపీఆర్ తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

by సూర్య | Wed, Aug 21, 2019, 07:08 PM

యూపీ: పోలీస్ కానిస్టేబుల్ కొన ఊపిరితో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. యూపీలోని హర్దోయ్ లో శివకుమార్ అనే వ్యక్తి కుటుంబతగాదాలతో తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారమందించారు. పోలీస్ కానిస్టేబుల్ ఎస్.కుమార్ ఘటనాస్థలానికి వచ్చి తలుపులు బద్దలు కొట్టాడు. కొన ఊపిరితో ఉన్న శివకుమార్ కు కానిస్టేబుల్ సీపీఆర్ (కార్డియో పల్మనరీ రెసస్కిటేషన్) అందించి ప్రాణాలు కాపాడాడు. మేం ఇంటికి చేరుకోగానే శివకుమార్ శ్వాస తీసుకోవడం లేదు. వెంటనే అతని సీపీఆర్ అందించి ఆస్పత్రికి తరలించామని కానిస్టేబుల్ అన్నాడు. శివకుమార్ కు కానిస్టేబుల్ సకాలంలో సీపీఆర్ అందించి ఆస్పత్రి తీసుకురావడం వల్ల అతని ప్రాణాలు కాపాడారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. శివకుమార్ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సీపీఆర్ అంటే గుండెను మళ్లీ బతికించే ప్రయత్నం చేయడం. ఇందుకోసం ఆపదలో ఉన్న వ్యక్తి ఛాతి మీద చేతులతో ఒత్తిడి కలిగించి గుండె కొట్టుకునేలా చేస్తారు.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM