వరదలవల్ల తీవ్రంగా దెబ్బ తిన్న భవానీ ద్వీపం

by సూర్య | Wed, Aug 21, 2019, 07:03 PM

నిత్యం పర్యాటకులు, సందర్శకులతో రద్దీగా ఉండే భవానీ ద్వీపం వరద ఉధృతి కారణంగా వెళవెళబోతోంది. కోట్ల రూపాయలు వెచ్చించి.. ఎంతో అందంగా.. అహ్లాదంగా నిర్మించిన భవానీ ద్వీపం వరదలవల్ల తీవ్రంగా దెబ్బతింది. పునరుద్ధరణకు రెండు నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. భవాని ద్వీపంలో ఐదు అడుగుల వరకు వరద నీరు చేరింది. దీంతో అక్కడున్న ఫర్నిచర్.. ధ్వంసం అయింది. ఫుట్ పాత్ పాడయింది.
పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలకొరిగాయి. మ్యూజిక్ ఫౌంటైన్, స్ట్రీట్ లైట్స్, ఇన్ఫో స్ట్రక్చర్ మొత్తం పూర్తిగా దెబ్బతింది. భవానీ ద్వీపంలో పక్షులు సైతం ఆహారం లేక చనిపోయిన పరిస్థితి నెలకొంది. ఫుట్ పాత్ మొత్తం బురదతో కూరుకుపోయింది. భారీగా నష్టం వాటిల్లింది. సుమారుగా రూ. కోటిన్నర వరకు నష్టం జరిగి ఉండవచ్చునని అధికారులు అంచనా. భవాని ద్వీపం రీ మోడలింగ్‌కు సుమారు రెండు కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఈడి ఉమామహేశ్వరరావు అన్నారు…

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM