రాజధాని అంశం అప్రస్తుతం: అవంతి శ్రీనివాస్

by సూర్య | Wed, Aug 21, 2019, 06:06 PM


నవ్యాంధ్ర రాజధానిపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాక రేపుతున్నాయి. బొత్స వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నిప్పులు చెరుగుతుంటే బొత్స వ్యాఖ్యలను వక్రీక రించారంటూ వైసీపీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. 
మంత్రి బొత్స వ్యాఖ్యలపై టీడీపీ చేస్తున్న విమర్శలను ఖండించారు మంత్రి అవంతి శ్రీనివాస్. రాజధాని అమరావతిపై మంత్రి బొత్స తన పరిధిలోని అంశాల గురించి చెప్పారని రాజధాని పై పూర్తి నిర్ణయం సీఎం జగన్ తీసుకుంటారని చెప్పుకొచ్చారు. 
రాజధానిని మార్చేస్తామని మంత్రి బొత్స ఎక్కడా వ్యాఖ్యానించ లేదన్నారు. ఇటీవల వచ్చిన వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఇలాంటి తరుణంలో రాజధాని అంశం అప్రస్తుతం అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని మళ్లీ కొత్త సమస్యలు సృష్టించుకోవడం మంచి పద్దతి కాదని అవంతి శ్రీనివాస్ హితవు పలికారు. 
గడచిన ఐదేళ్లలో తాత్కాలిక సెక్రటేరియంట్, తాత్కాలిక అసెంబ్లీ తప్ప రాజధానిలో ఇంకేమైనా కట్టారా అంటూ తెలుగుదేశంపై మండిపడ్డారు. అసలు రాజధానిలో టీడీపీ కట్టింది ఏమిటో తాము ఆపేసిందో ఏమిటో క్లారిటీగా చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేతలను ప్రశ్నించారు మంత్రి అవంతి శ్రీనివాస్. 


Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM