జగన్ 100 రోజుల గిఫ్ట్ గా పదవుల పందే రాలు

by సూర్య | Wed, Aug 21, 2019, 05:49 PM


పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత అఖండ మెజార్టీతో గద్దెనెక్కిన వైసీపీ ఏపీలో ఇన్నాళ్లపాటు పార్టీని కాపాడుకునేందుకు, బలోపేతం చేసేందుకు  అహర్నిశలు శ్రమించారు. ఇన్నేళ్ల శ్రమకు ఇప్పడు ఫలితాన్ని ఆశిస్తున్నారు. ఏదో ఒక పదవి దక్కాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే సీనియర్లు గా ఉండి సామాజిక కోణంలో మంత్రి పదవులు దక్కని వారికి, అలిగిన వారికి జగన్ నామినేటెడ్ పదవులు ఇచ్చేశారు. ఇప్పటికే జగన్ టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి - ఎస్వీబీసీ చైర్మన్ గా ఫృథ్వీ - ఏపీఐఐసీ చైర్మన్ గా రోజా - మహిళా కమిషన్ కు వాసిరెడ్డి పద్మా - కాపు కార్పొరేషన్ చైర్మన్ గా రాజా ఇలా కీలక పదవులను భర్తీ చేశారు. ఇంకా ఎన్నో పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ తమ సంగతేమిటని చాలామంది ఆశావహులు తాడేపల్లి జగన్ నివాసం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. జగన్ అమెరికా నుంచి రాగానే పదవుల భర్తీ పూర్తి చేయాలనుకుంటున్నా రట. కానీ, పార్టీలో/ప్రభుత్వంలో నంబర్-2గా చలామణవుతున్న సీనియర్లు మాత్రం.. ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారట. జగన్ పాలన 100 రోజులు పూర్తి చేసుకోబో తోంది. ఈ సందర్భంగా మండల - జిల్లా - రాష్ట్ర స్థాయి వరకు ఖాళీగా ఉన్న బోలెడు నామినేటెడ్ - కార్పొరేషన్ పదవులపై ఆశావహులు భారీ ఆశలు పెంచుకున్నారు. జగన్ నివాసం - మంత్రుల చుట్టూ తిరుగుతూ లాబీయింగ్ చేస్తున్నారు. జగన్ పదవుల భర్తీకి ఆసక్తిగా ఉన్నా వైసీపీ అధిష్టానంలోని పెద్దలు మాత్రం... ఇప్పుడే వద్దంటూ ఆపుతున్నారట. దీంతో, వైసీపీ పెద్దలపై కింది స్థాయి నేతలు గుర్రుగా ఉన్నారు. 
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ ఎన్నికల్లో కష్టపడి పార్టీని గెలిపించిన వారికే పదవులు ఇవ్వాలని వైసీపీ పెద్దలు సూచిస్తున్నారట.. ముందే పదవులు ఇస్తే వారు శ్రద్ధగా పనిచేయరని.. ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తేనే అనే మెలిక పెడితే పార్టీ కోసం కష్టపడుతారని భావిస్తున్నారట. జగన్ 100 రోజుల గిఫ్ట్ గా పదువుల పందేరానికి రెడీ అయినా స్థానిక సంస్థల ఎన్నికలను చూపి ఆయన ముందరి కాళ్లకు బంధం వేస్తున్నారట. 


Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM