కుప్పకూలిన హెలికాప్టర్‌

by సూర్య | Wed, Aug 21, 2019, 02:35 PM

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాలకు నిత్యవసర వస్తువులు తరలిస్తున్న హెలికాప్టర్‌.. పవర్‌ కేబుల్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ చాపర్‌ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌ కప్తాల్ లాల్‌, కోపైలట్‌ శైలేష్ తో పాటు స్థానిక నివాసి రాజ్ పాల్ మృతి చెందారు. ఉత్తరకాశీలోని మోరీ నుంచి మోల్దీకి బయల్దేరిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది.

Latest News

 
ఏపీ రాష్ట్రంలో సెంటు భూమి ఉన్నవాళ్లయినా సరే... చాలా జాగ్రత్తగా ఉండాలి : పవన్ కళ్యాణ్ Mon, Apr 29, 2024, 10:20 PM
ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి Mon, Apr 29, 2024, 10:16 PM
ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు Mon, Apr 29, 2024, 09:14 PM
నడిరోడ్డుపై సడన్‌గా ఆగిన కారు.. ఏమైందని వెళ్లి చూస్తే Mon, Apr 29, 2024, 08:54 PM
పోసాని కృష్ణ మురళికి సోదరుడి కుమారుడు షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక Mon, Apr 29, 2024, 08:51 PM