చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు

by సూర్య | Tue, Aug 20, 2019, 08:14 PM

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరానికి ఢిల్లీ హై కోర్టు.. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి ఝలక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆయన ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. దీంతో సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీబీఐ బృందం ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో చిదంబరం లేకపోవడంతో వెను దిరిగారు.  ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆయనను సీబీఐ పలుమార్లు విచారించింది. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ కోసం ఆయన చేసుకున్న పిటిషన్‌పై మంగళవారం విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన చట్టసభ సభ్యుడైనంత మాత్రాన ముందస్తు బెయిల్‌ ఇవ్వాల్సిన అవసరంలేదని పేర్కొంది. మరోవైపు, హైకోర్టు నిర్ణయాన్ని చిదంబరం తరఫున న్యాయవాది కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కాసేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది.

Latest News

 
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM
ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు Sun, Apr 28, 2024, 10:19 AM
వైసీపీ మేనిఫేస్టో తుస్సుమంది: గంటా Sun, Apr 28, 2024, 10:14 AM
ఇలా చేస్తే మహిళల ఖాతాలో రూ.లక్ష Sun, Apr 28, 2024, 09:56 AM
రానున్న 5 రోజులు ముప్పు.. జాగ్రత్త: IMD Sun, Apr 28, 2024, 09:54 AM