సెప్టెంబరు 2 నుంచి రచ్చబండ

by సూర్య | Tue, Aug 20, 2019, 05:25 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబరు 2 నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఆ రోజున దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి సందర్భంగా పులివెందులకు వెళ్లి ఆయన సమాధి వద్ద నివాళులర్పించాక ముఖ్యమంత్రి అక్కడి నుంచి రచ్చబండకు బయల్దేరి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. చిత్తూరు జిల్లా నుంచి రచ్చబండను ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని అనుప్పల్లె గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూనే రాజశేఖర్‌రెడ్డి మార్గమధ్యంలో మృతి చెందారు. ఇప్పుడు అదే గ్రామం నుంచి జగన్‌ రచ్చబండను ప్రారంభించవచ్చన్న ప్రచారం ఉంది. రచ్చబండ తేదీ, గ్రామం పేరు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.





 


 


 



Latest News

 
షర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు Fri, May 03, 2024, 02:50 PM
మోసపూరిత మాటలు నమ్మవద్దు: ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము Fri, May 03, 2024, 02:46 PM
విద్యుత్ నియంత్రికలో మంటలు.. రూ. 8 లక్షల నష్టం Fri, May 03, 2024, 02:45 PM
పెనగలూరు మండలంలో జోరుగా సాగుతున్న కూటమి ప్రచారం Fri, May 03, 2024, 02:10 PM
వడదెబ్బకు నెలటూరు గ్రామ వాసి మృతి Fri, May 03, 2024, 02:09 PM