రాజస్థాన్‌లోని 13జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు

by సూర్య | Tue, Aug 20, 2019, 02:11 PM

దేశంలోని పలు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలతో ఆయా రాష్ర్టాలు అతలాకుతలమవుతున్నాయి. రాజస్థాన్‌లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. రాష్ట్రంలో 33జిల్లాలుండగా, వాతావరణ కేంద్రం ప్రకటన మేరకు 13జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయింది. నాలుగు జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూసినైట్లెతే.. 546.84 మి. మీటర్ల వర్షపాతం నమోదయింది. ఇది సాధారణ వర్షపాతం కన్నా 44.8 శాతం ఎక్కువ. సాధారణ వర్షపాతం 377.52 మిల్లి మీటర్లు. 


అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలు.. బరన్, చిత్తోఘర్, చురు, దౌసా, దుంగర్‌పూర్, జైపూర్, ఝలావర్, జోద్‌పూర్, కోట, ప్రతాప్‌గర్, సవైమధోపూర్, బుంది, ఝూంజునూ, నాగౌర్, పాలి, సికర్, రాజ్‌సమంద్. ఈ జిల్లాల్లో సాధారణం కంటే 60శాతం ఎక్కువ వర్షపాతం నమోదయింది. ఆల్వార్, బాన్‌స్వారా, బార్మర్, భారత్‌పూర్, బికనీర్,ధోల్‌పూర్,జలోర్ మరియు సిరోలి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయింది. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు జల కళను సంతరించుకోగా, కొన్ని ప్రాజెక్టులు సాధారణ నీటితో ఉన్నాయి.


 


 

Latest News

 
జూన్‌ 9న కాకినాడ జిల్లా అరసం మహాసభ Thu, May 16, 2024, 09:03 PM
ఒంగోలులో పోలింగ్ ఎంతంటే? Thu, May 16, 2024, 09:01 PM
మాకు జీతాలు చెల్లించండి Thu, May 16, 2024, 09:00 PM
వైభవంగా కొనసాగుతున్న ‘గంగమ్మ జాతర' Thu, May 16, 2024, 08:59 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Thu, May 16, 2024, 08:58 PM