దేవుడు చిన్నచూపు చూసినా !కేరళ హైకోర్టులో లాయర్ గా!

by సూర్య | Mon, Jun 24, 2019, 10:11 PM

దేవుడు చిన్నచూపు చూశాడు. పుట్టుకతోనే అనారోగ్యాన్ని శాపంగా ఇచ్చాడు. చిన్ననాటి నుంచి కష్టాలు తప్ప మరొకటి తెలియదు. అంగ వైకల్యం కారణంగా అందరితోనూ అవమానాలు పడింది. ఆర్థిక కష్టాలు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. దీనికి తోడు విధి కూడా పగ బట్టింది. ప్రకృతి కోపాగ్ని కారణంగా తలదాచుకోనేందుకు ఉన్న గూడు కూడా వరదల్లో కొట్టుకుపోయింది. ఇళ్లు లేక నిరాశ్రయులయ్యారు. ఇద్దరు తోబొట్టువులు, తల్లిదండ్రులే తనకు ఆధారం. వారి సంతోషం కోసమే తన జీవితాన్ని నెట్టుకొస్తోంది. బాగా చదువుకోవాలి. లాయర్ కావాలనేది ఆమె కోరిక. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. 
కేరళ హైకోర్టులో లాయర్ గా :
అదే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది. అవమానాలను లెక్కచేయలేదు. చివరికి అనుకున్న లక్ష్యాన్ని చేరింది. లాయర్ కావాలనే కోరికను నెరవేర్చుకుంది. అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె ఎవరో కాదు.. కేరళలోని ఎర్నాకులానికి చెందిన 28ఏళ్ల ప్రమిత అగస్టేయిన్. జూన్ 16న కేరళ హైకోర్టులో న్యాయవాదిగా చేరింది. ఆమె స్వస్థలం.. ఉత్తర ఖుతియాతోడ్.. ఎర్నాకులం, త్రిసూర్ జిల్లా సరిహద్దు గ్రామం. అలువాలోని సెయింట్ షేవియర్ కాలేజీ నుంచి ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. లా డిగ్రీ పూర్తిచేయాలనే కోరిక ఇక్కడే చిగురించింది.
ఎత్తుపై ఎగతాళి  చేసినా :


ప్రమీత.. 3.5 అడుగుల ఎత్తు ఉంటుంది. చూడటానికి చాలా పొట్టిగా కనిపిస్తుంది. స్కూళ్లనే స్నేహితులందరూ తన ఎత్తును చూసి అవహేళన చేసేవారు. స్కూల్లో చదివే రోజుల్లో ఎన్ని అవమానాలు ఎదురైనా అదరలేదు.. బెదరలేదు.. కష్టాలను నవ్వుతూ ఎదురించి పోరాడింది. పుట్టుకతోనే ప్రమీత ఎముకలు చాలా బలహీనంగా ఉండేవి. బయటకు వెళ్లాలంటేనే ఎంతో కష్టపడేది. ఎక్కువ దూరం కూడా నడవలేదు. పరీక్ష కేంద్రానికి వెళ్లాలన్న కష్టమే.
లా చదివే రోజుల్లో కూడా ఇలాంటి కష్టనష్టాలను ఎన్నో ఎదుర్కొన్నానని ప్రమీత చెప్పుకోచ్చింది. వ్యవసాయం కుటుంబంలో పుట్టిన ప్రమీత.. ఆర్థిక కష్టాల మధ్యనే పెరిగింది. చదివించే స్థోమత లేకపోయిన తల్లిదండ్రులు చదివించేందుకు వెనుకాడలేదు. తండ్రి హార్ట్ పేషెంట్.. తల్లికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. కొన్నేళ్ల క్రితం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రమీత తల్లి కిడ్నీలు చెడిపోయాయి. గత 20ఏళ్ల ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని నెట్టుకుస్తున్నారు.
ఆశయమే అవధి.. అందరికి ఆదర్శంగా :
అయినప్పటికీ ఎన్నడూ కూడా ప్రమీతను చదువు మానేయమని, లాయర్ కావాలనే తన కలకు తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. వరదల్లో ఇళ్లు కొట్టుకుపోయి నిరాశ్రయులైన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో కుటుంబ కష్టాలను నవ్వుతూ జయించారు. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని, అందులో కొన్నింటిని విజయవంతంగా ఎదుర్కొటాం. కొన్నిసార్లు కష్టాలు మనిషిని కృంగతీస్తాయి.
ఇలాంటి సమయాల్లో పిరికితనంతో భయపడొద్దని, ధైర్యంగా ఎదుర్కొవాలని ప్రమీత తన జీవితంలో ఎదురైన కష్టనష్టాల గురించి చెప్పుకొచ్చింది. లాయర్ కావడంతో తన డ్రీమ్ నెరవేరలేదని, పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుందని తెలిపింది. తన ప్రొఫెషన్ న్యాయం చేయడమే లక్ష్యంగా కెరీర్ పై దృష్టిపెట్టింది. 

Latest News

 
ప్రకాశం జిల్లా తీర్పు విభిన్నం.. 12 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు Sat, May 04, 2024, 07:47 PM
గుంటూరు జిల్లాలో గెలిచే పార్టీదే అధికారం.. 17 నియోజకవర్గాల బరిలో ఎవరెవరు? Sat, May 04, 2024, 07:42 PM
టీటీడీకి అశోక్ లేలాండ్ కంపెనీ భారీ విరాళం Sat, May 04, 2024, 07:36 PM
నెల వ్యవధిలో రెండుసార్లు.. తనిఖీ చేసిన పోలీసులకే షాక్.. కళ్లు జిగేల్ Sat, May 04, 2024, 07:33 PM
ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీదే అధికారం.. తేల్చేసిన తెలంగాణ లీడర్ Sat, May 04, 2024, 07:25 PM