పైలట్ చేతివాటం!స‌స్పెన్ష‌న్ వేటు!

by సూర్య | Mon, Jun 24, 2019, 08:29 PM

ఎయిరిండియాకు చెందిన ఒక పైలట్ తన చేతివాటం ప్రదర్శించటంతో తన ఉద్యోగాన్నికోల్పోవలసి వచ్చింది. 2019 జూన్ 22 వతేదీ శనివారం ఉదయం సిడ్నీ నుంచి ఢిల్లీ  వచ్చే ఏఐ301  విమానం పైలట్ రోహిత్ భాసిన్ పర్సు దొంగిలించారని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. భాసిన్ విమానం బయలు దేరటానికి కొద్ది నిమిషాల ముందు సిడ్నీ ఎయిర్ పోర్టు లోని ఓ డ్యూటీ ఫ్రీ షాపులోకి వెళ్లి తనకు నచ్చిన వాలెట్ ను దొంగిలించారని తెలిసింది. ఈసమాచారాన్ని ఆస్ట్రేలియా అధికారులు వెంటనే ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చారు. ఆస్ట్రేలియా అధికారుల సమాచారానికి స్పందించిన అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
పర్సు దొంగిలించిన విషయం నిజమని తేలటంతో  భాసిన్ ఇండియాకు రాగానే సస్పెన్షన్ ఆర్డర్లు అందచేశారు.  ఐడెంటిటీ కార్డును ఉన్నతాధికారులకు అప్పగించాలని, తమ లిఖిత పూర్వక అనుమతి లేకుండా  భాసిన్ నివాస స్ధలమైన కొల్ కతా విడిచి వెళ్లరాదని ఆదేశించింది.  అనుమతి లేకుండా ఎయిర్ ఇండియా ప్రాంగణంలోకి కూడా ప్రవేశించరాదని ఆదేశించింది. కాగా... రోహిత్ భాసిన్ ఎయిరిండియాలో సీనియారిటీ అనుసరించి ఈస్ట్రన్ డివిజన్ రీజనల్ డైరెక్టర్ హోదాలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి వాలెట్ దొంగిలించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.  


 

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM