జూలై 12 నుంచి తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

by సూర్య | Mon, Jun 24, 2019, 05:25 PM

టిటిడికి అనుబంధంగా ఉన్న కడప జిల్లా తాళ్లపాకలో గల శ్రీ చెన్నకేశవస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ   బ్రహ్మోత్సవాలకు జూలై 11వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు.


స్వామివారి వాహనసేవలు : జూలై 12న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి చిన్నశేషవాహన సేవ నిర్వహిస్తారు. జూలై 13న ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంస వాహనం, జూలై 14న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సింహ వాహనం, జూలై 15న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి హనుమంత వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు. జూలై 16న ఉదయం మోహినీ అవతారం, గరుడసేవ, సాయంత్రం 4 గంటలకు ఏకాంతసేవ నిర్వహిస్తారు.


జూలై 17వ తేదీ ఉదయం పల్లకీ సేవ, సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత రాత్రి 9 గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరిస్తారు. జూలై 18న ఉదయం పల్లకీసేవ, సాయంత్రం 6.30 గంటలకు రథోత్సవం, జూలై 19న ఉదయం పల్లకీసేవ, రాత్రి అశ్వవాహనం, జూలై 20న ఉదయం 9 గంటలకు వసంతోత్సవం, ఉదయం 11.15 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Latest News

 
కబడ్డీ పాలెంలో దామచర్ల కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం Thu, May 02, 2024, 04:19 PM
ప్రజలకు అందుబాటులో ఉండేందుకే పార్టీ కార్యాలయాలు ఏర్పాటు Thu, May 02, 2024, 04:14 PM
నాగిరెడ్డిపల్లిలో ఎన్నికల ప్రచారం Thu, May 02, 2024, 04:11 PM
కొరిశపాడు, రేణింగివరం రహదారిపై రోడ్డు ప్రమాదం Thu, May 02, 2024, 04:09 PM
విద్యారంగాన్ని విస్మరించిన ప్రజాప్రతినిధులు Thu, May 02, 2024, 04:07 PM