ఇండోనేసియాలో భారీ భూకంపం

by సూర్య | Mon, Jun 24, 2019, 10:04 AM

   జకార్తా: ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. యందేనా ఐలాండ్‌లోని సోంలకీ సముద్ర తీరం వద్ద సంభవించిన ఈ భూకంపం తీవ్రత 7.5గా నమోదైంది. ఆదివారం రాత్రి 10.05 గంటల సమయంలో ఇది సంభవించింది. ఇండోనేసియా ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం..యాంబన్‌ దక్షిణాన 321కిలోమీటర్ల దూరంలో బండా సముద్ర తీరం వద్ద భూమికి 214కి.మీ లోపల భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 30క్షణాల కంటే ఎక్కువ ఈ ప్రకంపనలు వచ్చాయి.  దీంతో ప్రజలందరూ ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అక్కడ సునామీ సంభవించే అవకాశం కూడా ఉందని ప్రభుత్వం తెలిపింది. సునామీ పరిధిలోని ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

 
ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన Mon, May 06, 2024, 08:00 PM
ఇద్దరు ఒకే వీధిలో ఉంటారు.. తండ్రి ఏపీలో, కుమారుడు తెలంగాణలో Mon, May 06, 2024, 07:57 PM
కేకే లైన్‌లో జారిపడిన బండరాళ్లు.. అప్పుడే గూడ్స్ రైలు రావడంతో Mon, May 06, 2024, 07:53 PM
నేనూ ల్యాండ్ టైటిలింగ్ చట్టం బాధితుడినే.. వివరాలతో ఆంధ్రప్రదేశ్ మాజీ ఐఏఎస్ ట్వీట్ Mon, May 06, 2024, 07:50 PM
పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే నీ ముగ్గురు భార్యల్ని తీసుకొచ్చి పరిచయం చేయి: ముద్రగడ పద్మనాభం Mon, May 06, 2024, 07:46 PM