మాకు అవ‌కాశం ఇవ్వండి! శివ‌సేన‌!

by సూర్య | Fri, Jun 21, 2019, 08:39 PM

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై శివసేన పార్టీ అక్కసు వెళ్లగక్కింది. లోక్‌సభ ఉపసభాపతి పదవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు వస్తున్న వార్తలపై శివసేన పార్టీ మండిపడుతోంది. డిప్యూటీ స్పీకర్ పదవిని శివసేన పార్టీ ఆశిస్తుందని తెలిసి కూడా వైసీపీ వెంట పడటం ఎందుకని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను నిలదీశారు. ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా శివసేన ఉందని లోక్ సభలో తమ పార్టీ 18 మంది సభ్యుల ప్రాతినిధ్యం ఉండగా వైసీపీని ఎందుకు అడుగుతున్నారని మండిపడ్డారు.  లోక్ సభలో బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ ఉందని అలాగే బీజేపీకి శివసేన పార్టీ అండగా ఉందన్నారు. ఇలాంటి తరుణంలో వేరొక పార్టీని బతిమిలాడుకోవాల్సిన అవసరం ఏముందని శివసేన నిలదీసీనిట్లు సామ్నా పత్రిక సంపాదకీయంలో వార్త ప్రచురితమైంది.  ఇదిలా ఉంటే బీజేపీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్ పదవి ఆఫర్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వండి పదవులు వద్దని జగన్ తెగేసి చెప్పినట్లు సమాచారం. 


 

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM