సిఎం జ‌గ‌న్ ను క‌లిసిన పోస్కో సీఈవో!

by సూర్య | Fri, Jun 21, 2019, 08:30 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పేందుకు కొరియన్‌ స్టీల్ కంపెనీ పోస్కో ఆసక్తి కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ సీఈవో బాంగ్‌ గిల్‌ హో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయి తమ అభిప్రాయాన్ని తెలిపారు. పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ క్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో త్వరలోనే పోస్కో సాంకేతిక బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. కంపెనీ ఏర్పాటుకై స్థలాన్ని అన్వేషించనుంది. కాగా స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పంతో ఉన్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం‌ ఆ దిశగా కార్యాచరణ ముమ్మరం చేసింది.


 

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM