పార్టీ అధ్య‌క్షుడి ఎంపిక‌లో జోక్యం చేసుకోను

by సూర్య | Fri, Jun 21, 2019, 12:57 AM

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయాన్ని రాహుల్‌ గాంధీ వెన‌క్కి తీసుకున్న‌ట్టు క‌నిపించ‌డంలేదు.  పైగా త‌న‌ తదుపరి అధ్యక్ష ఎన్నికపైనా  ఆయన త‌న‌కు సంబంధంలేన‌ట్టే చేస్తున్న వ్యాఖ్యలు  మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గురువారం పార్లమెంటు సమావేశాల అనంత‌రం ఆయ‌న‌ మీడియా  మీడియాతో మాట్లాడుతున్న‌ప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఉండబోతున్నారంటూ జ‌ర్న‌లిస్టు మిత్రులు కొంద‌రు  రాహుల్‌ను ప్రశ్నించారు.  అయితే పార్టీకి సంబంధించిన వ‌ర‌కు కొత్త అధ్యక్షుడి ఎంపికలో జవాబుదారీతనం ఉండాలని ,   తదుపరి అధ్యక్షుడి ఎంపికలో తాను జోక్యం చేసుకోవడం లేదని , ఎవ‌రు పార్టీ అధ్య‌క్షుడైనా, త‌ను సాధార‌ణ కార్య‌క‌ర్త‌గానే పార్టీకి సేవ‌లందిస్తాన‌ని స్ప‌ష్టం చేసారు.   సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా విఫలమయినందుకు పార్టీ అధినేత‌గా బాధ్యత తీసుకుంటూ రాహుల్‌ కూడా రాజీనామా ప్రతిపాదన పంపించాన‌ని  ఇది పార్టీ అధిష్టాన స‌భ్యులు మూకుమ్మడిగా తిరస్కరించినా వెను దిరిగేది లేద‌ని తేల్చి చెప్ప‌డంలో సోనియా పార్టీ అధ్య‌క్షుడి ఎంపికపై దృష్టి సారించిన‌ట్టు విన‌వ‌స్తోంది.


 


 

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM