పైలట్లు ఇంటి భోజనం తీసుకెళ్లకుండా చర్యలు!ఎయిరిండియా!

by సూర్య | Thu, Jun 20, 2019, 06:52 PM

ఇంటి భోజనమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తమ లంచ్ బాక్సులను ఉద్యోగులు ఆఫీసులకు తీసుకెళ్లడం తెలిసిన విషయమే. కానీ ఇకపై విమానాల్లో పనిచేసే వారు ఆ ఛాన్స్ మిస్ చేసుకోబోతున్నారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా విమానయాన సంస్ధకు చెందిన పైలట్లు ఇకపై ఇంటి భోజనాన్ని తెచ్చుకోవడాన్ని కోల్పోబోతున్నారు.  ఇంటి భోజనంపై ఆంక్షలు విధించాలని  సంస్ధ అధికారులు ఆలోచన కూడా చేస్తున్నారట.
ఇటీవల  బెంగళూరు నుంచి కోల్ కతా వెళుతున్న ఓ ఎయిరిండియా విమానంలో  పైలట్ తాను తిన్న బాక్స్ ను శుభ్రం చేయాలని  అక్కడే  పనిచేస్తున్న సిబ్బందికి ఆర్డర్ వేయడంతో ..తామెందుకు శుభ్రం చేయాలని  వారు వాగ్వాదానికి దిగారు. దీంతో విమానం రెండు గంటలు ఆలస్యమైంది. అధికారులు కల్పించుకుని  ఈ గొడవకు కారణమైన ఇద్దరినీ విమానం నుంచి దించేసి ఆతర్వాత విమానాన్ని కోల్ కతాకు  పంపించారు. ఈ నేపధ్యంలో ఇకపై  ఎయిరిండియా విమానాల్లో పైలట్లు ఇంటి భోజనం తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోబోతున్నారు.


 

Latest News

 
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా..! కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిపై కూటమి నేతల గుర్రు. Tue, Apr 30, 2024, 10:46 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో. Tue, Apr 30, 2024, 09:18 PM
టీ టైమ్ ఉదయ్ పోలింగ్ టైమ్ లో రాణిస్తారా Tue, Apr 30, 2024, 09:16 PM
పోలీసులను చూడగానే డ్రైవర్ తత్తరపాటు..కారు ఆపి చెక్ చేస్తే వామ్మో Tue, Apr 30, 2024, 09:10 PM
మల్లెతోటలో బ్రాహ్మణి.. లోకేష్ కోసం ప్రచారం చేస్తూ Tue, Apr 30, 2024, 09:07 PM