చంద్రబాబు తరఫున నామినేషన్ వేయనున్న భార్య భువనేశ్వరి

by సూర్య | Fri, Mar 22, 2019, 09:20 AM

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. అయితే, చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్న నేపథ్యంలో ఆయన తరఫున అర్ధాంగి భువనేశ్వరి కుప్పంలో శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు.  చంద్రబాబు 1989 నుంచి కుప్పం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఆయన అసెంబ్లీ బరిలో దిగడం ఇది ఏడవ పర్యాయం. గతంలో కొన్ని సందర్భాల్లో పార్టీ కార్యకర్తలే చంద్రబాబు తరఫున నామినేషన్ వేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో కుప్పంకు వచ్చే వీల్లేక విజయవాడలోనే సివిల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరై నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఇప్పుడా పత్రాలనే భువనేశ్వరి కుప్పంలో ఎన్నికల అధికారులకు అందజేయనున్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM