22న జరిగే పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

by సూర్య | Wed, Mar 20, 2019, 11:32 PM

కృష్ణా - గుంటూరు పట్ట భద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల ప్రచారం బుధవారం సాయం త్రంతో ముగియనుంది. పోలింగ్‌ జరిగే 22వ తేదీకి 48 గంటల ముందుగా ప్రచారాలకు తెరదించాలని ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల మేరకు నేటితో ప్రచారాలు పరిసమాప్తం కాను న్నాయి. మద్యం దుకాణాలకు కూడా రెండురోజులు సీలు వేయనున్నారు. ఇప్పటికే అభ్యర్థులు తమకున్న యం త్రాంగాలను రంగంలోకి దింపి ఓటర్ల ఇళ్లకు పంపి స్లిప్పులు పంపిణీ చేయి స్తున్నాయి. ప్రత్యక్ష ప్రచారానికి తెర పడనున్నప్పటికీ సామాజిక మాధ్య మాల ద్వారా జరిగే ప్రచారాలను కట్టడి చేసే పరిస్థితి లేకపోవడంతో ఆ దిశగా అభ్యర్థులు దృష్టి సారిస్తున్నట్లు సమా చారం.  ఈ దఫా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్ని కల కోసం రెండు జిల్లాల్లో కలిపి 2,48, 799 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో కృష్ణా జిల్లా నుంచి పురు షులు 65,501, మహిళలు 41,218, ట్రాన్స్‌జెండర్లు 10 మంది నమోదు చే సుకొన్నారు. గుంటూరు జిల్లాలో 90, 912 మంది పురుషులు, 92,363 మంది మహిళలు, 13 మంది మూడో లింగం ఓటర్లు నమోదు చేసుకొన్నారు. ఓటర్ల కోసం కృష్ణా జిల్లాలో 153, గుం టూ రులో 209 కలిపి మొత్తం 362 పో లిం గ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు.ఇప్పటికే ఓటరు నెంబరు, పోలింగ్‌ బూత్‌ నెం బరు, చిరునామా తదితర వివరాలను ఓటర్‌ జాబితాల్లో పొందుపరిచారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM