రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా కు సంబంధించి నోటీసులు జారీ : ద్వివేది

by సూర్య | Tue, Mar 19, 2019, 05:00 PM

మీడియా సర్టిఫికెషన్ అండ్ మోనటరింగ్ కమిటీ ఆరు, ఏడు శాఖల సమన్వయం తో ఏర్పాటు చేయడం జరిగింది.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది మంగళవారం వెలగపూడి ఎలక్షన్ మీడియా సెంటర్ లో మీడియా సమావేశంలో పాల్గొన్న అదనపు సీఈఓ లు సుజాత శర్మ, వివేక్ యాదవ్. ద్వివేది మీడియా తో మాట్లాడుతూ ..వివిధ రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా కు సంబంధించి  89 నోటీసులు జారీ చేసాం, తెలుగుదేశం పార్టీకు 48, వైఎస్ఆర్ సిపి కి 30, జనసేన పార్టీ కి 11 జారిచేసాం. ఎన్నికల నియమావళి ని ఉల్లంఘించవద్దని కోరుతున్నాము.సోషల్ మీడియాను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నాము.అభ్యర్థులవారిగా పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారులకు తెలియచెయ్యడం జరిగింది.పోలీస్, కమర్షియల్ టాక్స్, ఇన్ కం టాక్స్, ఎక్సయిజ్, తదితర శాఖల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ని 175 నియోజకవర్గం పరిధిలో 3635 సి-విజిల్ బృందాలు పనిచేస్తున్నాయి. సి విజిల్ ద్వారా 1304 ఫిర్యాదు లు నమోదు అయ్యాయి.పోస్టర్ల/బ్యానర్ ల తొలగింపు, బహుమతులు, కూపన్లు పంపిణీ, కులాలకు, మతాలకు సంబంధించిన ప్రసంగాలు, మద్యం, నగదు పంపిణీ, ఇతరుల ఆస్తులు దుర్వినియోగం,  ప్రజల తరలింపుకు రవాణా సదుపాయాలు, చెల్లింపు వార్తలు, సమయం మించిన తరువాత లౌడ్ స్పీకర్లు వాడడం, అనుమతులు లేకుండా  వాహనాలు  ఉపయోగించే వాటిపై ఫిర్యాదులు


మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు సంబంధించిన అధికారుల శిక్షణ పూర్తి చెయ్యడం జరిగింది. పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలెక్షన్ కమిషన్ జారీ చేసిన ఎంసిసి  నియమావళి మేరకు రాజకీయ పార్టీలకు తెలియ చెయ్యడం జరుగుతున్నది.పోలీసులు ఆధ్వర్యంలో ని ఫ్లయింగ్ స్క్వాడ్ లు 220 ఎఫ్ ఐ ఆర్ లు, రూ.2,39,89,135 సీజ్ చేసారు. బంగారం 8 కేజీల 26 గ్రాములు, వెండి 22 కేజీలు, 1043 బాటిళ్లు మద్యం, రెండు వాహనాలు, 33 కేజీల గంజాయి, 324 చీరలు పట్టుకోవడం జరిగింది


రాష్ట్రంలో ఫారం-7 ద్వారా వొచ్చిన దరఖాస్తు లలో 170 నియోజకవర్గాల  పరిధిలోని 1,55,099 డెత్, డూప్లికేట్ ఓట్లను తొలగించాం.2019 జనవరి 11 వ తేదీ తర్వాత 15 లక్షల ఓట్లు పెరగడం జరిగింది. 10,64,441 ఫారం-6 ద్వారా ఓట్ల నమోదుకు రావడం జరిగింది. రాబోయే ఐదు  రోజుల్లో వాటిని పూర్తిగా పరిష్కరించడం జరిగింది.స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించేలా అందరూ సహకరించాలని కోరారు.ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించేందుకు ఎన్నికల సంఘానికి సహకరించాలి  ద్వివేది తెలిపారు 


 


 

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM