వైసీపీ కి ఓట్లు వేస్తే ప్రజలకు రక్షణ లేదు : దేవినేని ఉమా

by సూర్య | Tue, Mar 19, 2019, 04:47 PM

చంద్రబాబు గారు అమరావతి నుంచి పార్టీ టికెట్స్ ఇస్తుంటే ఈ దొంగల పార్టీ మాత్రం మోదీ, కేసీఆర్ డైరెక్షన్ లో హైదరాబాద్ నుంచి  ఇస్తున్నాడని, ఇలాంటి వాళ్లకు మనం ఓట్లు వేస్తే ఆ ఓటు కేసీఆర్ కి వేసినట్టేనని ఏపీ జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు.  మంగళవారం నాడు మండలంలోని తోలుకొడు గ్రామంలో ఇంటింటికి వెళ్తూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ని సంక్షేమ కార్యక్రమాలను మంత్రి ఉమా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయా సభలలో మంత్రి ఉమా మాట్లాడుతూ, వైసీపీ కి ఓట్లు వేస్తే ప్రజలకు రక్షణ లేదని, 6 నెలల క్రితం ఈ గ్రామంలోకి దొంగలు వచ్చారని, అలాంటి వ్యక్తికి మనం ఓటు వేయలా ? అని అన్నారు. 2014 ఎలక్షన్ అప్పుడు ఈ దొంగల పార్టీ అభ్యర్థి ఎక్కడ... ఏ జైల్ లో ఉన్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


అభివృద్ధి కోసం మేము గ్రామాల్లో తిరుగుతుంటే, వాళ్ళు కేసులు కోసం కోర్టుల్లో తిరుగుతున్నారని, మనం అభివృద్ధి చేస్తుంటే, ఆ అభివృద్ధి జరగకూడదు ప్రజలకు మంచి జరగకూడదు అని ఎక్కడికక్కడ స్టే లు తెస్తున్నారన్నారు. 1994 లో పాపట్ల మేరీ చనిపోయింది ఆ కుటుంబం చిన్నా భిన్నం అయిపోయింది - దానికి కారణం ఈ దొంగల పార్టీ అభ్యర్ధేనన్నారు. 21న నేను నామినేషన్ వేస్తున్నానని, మీరందరూ వచ్చని నన్ను ఆశీర్వదించాలని ప్రజలను మంత్రి ఉమా కోరారు. ఈ నెల మార్చి 29 టీడీపీ నాది పుట్టిన రోజని, ఏప్రిల్ 1 ఎన్టీఆర్ భరోసా పండుగని మంత్రి తెలిపారు. మైలవరం వస్తే హ్యాట్రిక్ ఎమ్యెల్యేని చేశారని, 4వ సారి మంత్రిని చేశారని తెదేపా నాయకులు ఇచ్చే హామీలు అన్నిటికి ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి పనులు చేపించే బాధ్యత నాదని స్పష్టం చేశారు.


తొలుత గ్రామ పొలిమేరలో మంత్రికి గ్రామస్థులు  హారతులతో, కుంకుమ దిద్దుతూ మహిళలు యువత బైక్ ర్యాలీ తో ఘన స్వాగతం పలికారు. మంత్రి ఉమాపై బంతిపూల వర్షం కురిపించారు. మంత్రిని కలవడానికి ఇళ్ళల్లో నుంచి బయటికి వచ్చి మహిళలు స్వాగతం పలికారు. గ్రామంలోకి వచ్చిన మంత్రితో సెల్ఫీ దిగేందుకు మహిళలు, యువత, పిల్లలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM