గోవా సీఎంగా ప్ర‌మోద్ ప్ర‌మాణం

by సూర్య | Tue, Mar 19, 2019, 10:05 AM

గోవా మాజీ స్పీక‌ర్ ప్ర‌మోద్ సావంత్‌.. ఆ రాష్ట్ర సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. సోమ‌వారం అర్థ‌రాత్రి 2 గంట‌లకు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగింది. కూట‌మి పార్టీల‌ను ఒక్క ద‌గ్గ‌ర‌కు తీసుకువ‌చ్చేందుకు సోమ‌వారం బీజేపీ పార్టీ శ్రేణులు తెగ క‌ష్ట‌ప‌డ్డారు. మాజీ సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్ మృతిచెంద‌డంతో.. గోవాలో ఈ ప‌రిణామం చోటుచేసుకున్న‌ది. సోమ‌వారం సాయంత్ర‌మే పారిక‌ర్ పార్థివ‌దేహానికి అంత్యక్రియ‌లు నిర్వ‌హించారు. అయితే 45 ఏళ్ల ప్ర‌మోద్ సావంత్‌కే సీఎం ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశాలు ఉన్న‌ట్లు నిన్న ఉద‌యం నుంచే ఊహాగానాలు వినిపించాయి. వాస్త‌వానికి రాత్రి 11 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేయాల‌నుకున్నారు. కానీ ఆ కార్య‌క్ర‌మాన్ని అర్థ‌రాత్రి 2 గంట‌ల‌కు మార్చేశారు. గోవా ఫార్వ‌ర్డ్ చీఫ్ విజ‌య్ స‌ర్దేశాయ్‌, మ‌హారాష్ట్ర‌వాది గోమాంత‌క్ పార్టీ ఎమ్మెల్యే సుదిన్ ద‌వ‌లిక‌ర్‌లు ప్ర‌స్తుతం డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. గోవా క్యాబినెట్‌లో మ‌రో 9 మంది మంత్రులుగా ఉన్నారు. డిప్యూటీ స్పీక‌ర్ మైఖేల్ లోబో .. ఇప్పుడు స్పీక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. పారిక‌ర్ అంత్య‌క్రియ‌లు జ‌రిగిన త‌ర్వాత జ‌రిగిన బీజేపీ స‌మావేశంలో సావంత్‌ను స‌భా నేత‌గా ఎన్నుకున్నారు.

Latest News

 
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM
పిఠాపురం ఎన్నికల బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి.. చదువు, ఆస్తులెంతో తెలుసా Fri, Apr 26, 2024, 07:43 PM
ఏపీలో ఆ పార్టీకి షాక్.. అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ Fri, Apr 26, 2024, 07:39 PM
కాకినాడ ఎన్నికల బరిలో కిలాడి టీ టైమ్ శ్రీనివాస్ Fri, Apr 26, 2024, 07:34 PM