విజ‌య‌వాడ‌ని అభివృద్ధి చేస్తా- వైసీపీ అభ్యర్థి పివిపి

by సూర్య | Tue, Mar 19, 2019, 02:00 AM

విజయవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని విజయవాడ పార్లమెంటరీ వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ పేర్కొన్నారు. మ‌హాత్మాగాంధీ రోడ్డులోని వైసీపీ కార్యాలయంలో సోమ‌వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిసి మాట్ల‌డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేమంతా మీతో ఉన్నామన్నారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం కోసమే వచ్చానని ఇప్పుడు బిడ్డల భవిష్యత్తు కోసం వేసే పునాదులు ఐదు తరాల వారికి ఉపయోగపడాలని, నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు.


పీవీపీ అంటే ప్రగతి వైపు పరుగు అని విమర్శలతో కాలయాపన చేయను అని తెలిపారు. విజయవాడలో పివిపి మాల్‌ని ఏర్పాటు చేశానని నేటి యువత సరైన గైడెన్స్ లేక ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం సెంటర్ ఏర్పాటు చేయటం త‌న క‌ల అని తెలిపారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న‌ట్లుగా ఉన్నాయ‌న్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సరైన డ్రైనేజీ సౌకర్యం లేదని, చెత్త సమస్య తీరలేదని, దోమల బెడద ఉందని తెలిపారు. లక్షల రూపాయల టర్నోవర్ చేస్తున్న ప్రభత్వం కనకదుర్గ ఫ్లైఓవర్ ఇంతవరకు పూర్తి చేయకపోవటం, పోలవరం పూర్తి చేయకపోవటం వారి అసమర్థత అన్నారు. ఒక ప్రాజెక్టు మొదలు పెట్టిన తర్వాత త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వైయస్సార్ పరిపాలన 2004 నుంచి 2009 వరకు స్వర్ణయుగమని అటువంటి స్వర్ణయుగం జగన్ సారధ్యంలో రాబోతుంద‌న్నారు. విజయవాడకు సంవత్సరానికి వంద చొప్పున ఈవెంట్‌లు రావడానికి కృషి చేస్తానని,  తెలుగు సినిమా పరిశ్రమ విజయవాడలో షూటింగ్‌లు జరిపే విధంగా కృషి చేస్తానన్నారు. ఫ‌లితంగా ప్రజలకు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. వైద్య, విద్య, ఉపాధి రంగాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అన్నారు. టీం వర్క్‌తో పనిచేసి విజయం సాధిస్తామని తెలిపారు. అనంతరం విజయవాడ సెంట్రల్ వైసిపి ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ విభజన సమయంలో సమయంలో చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రబాబు నిజస్వరూపం చూపించారన్నారు. రౌడీయిజం, హత్యా రాజకీయం, అవినీతి అంతా చంద్రబాబు పాలనలో చూపించారని ధ్వజమెత్తారు. వైకాపా కార్యక్రమాలను టీడీపీ కాపీ కొట్టింద‌ని, ఎన్నికల నోటిఫీకేషన్ టైంలో డ్వాక్రా రుణాల పేరిట మహిళలకు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. విజయవాడలో అత్యధిక ఓట్లుతో గెలుపొందిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవినీతి, దందాలు చేశార‌ని ఆరోపించారు. విలేక‌రుల స‌మావేశంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధులు వెలంపల్లి శ్రీనివాసరావు, బొప్పన భ‌వ‌కుమార్, ర‌క్ష‌ణ‌నిధి, త‌దితరులు పాల్గొన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM