by సూర్య | Fri, Oct 25, 2024, 03:04 PM
పవిత్రమైన కార్తీక మాసం నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసంలో భక్తులు శైవ క్షేత్రాలకు వెళ్తారు. వీరి సంఖ్య ప్రతీ ఏటా రికార్డు స్థాయిలో ఉంటుంది.దీంతో, భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపాలని నిర్ణయించింది. ఇందు కోసం 350 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. ఈ బస్సుల రూట్లు..గమ్య స్థానాలు.. షెడ్యూల్ ను ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.కార్తీక మాసంలో శివాలయాలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. నవంబర్ 2 నుంచి 30వ తేదీ వరకు కార్తీక మాసం. సాధారణంగా ప్రతీ ఏటా కార్తిక మాసంలో భక్తులు పంచారామాలు, త్రిలింగ దర్శిని ప్యాకేజీలను వినియోగించుకుంటారు. ఈ ప్యాకేజీ లతోపాటు వన భోజనాలు, ఆలయాల సందర్శన కోసం ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకుంటున్నారు. ఈ ఏడాదా గత ఏడాది కంటే ఎక్కువ సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందు కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను ప్రకటించారు.పంచారామాల ప్యాకేజీలో భాగంగా ఒకే రోజు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోటలో క్షేత్రాలను దర్శించుకునేలా ఖరారు చేసారు. ఉమ్మడి కర్నూలు జిల్లా యాగంటి, మహానంది, శ్రీశైలం ఆలయాలకు ఒకటిన్నర రోజులో వెళ్లి వచ్చేలా త్రిలింగ దర్శిని ప్యాకేజీని సిద్దం చేసారు. వీటితోపాటు అన్నవరం, శ్రీశైలం, కొండవీడు, కర్ణాటకలోని దేవనహళ్లి తదితర ఆలయాలకు వేరుగా బస్సులు నడుపుతున్నారు. డిమాండ్‌ను బట్టి అరుణాచలం, సముద్ర స్నానాలకు కూడా బస్సులను నడపాలని నిర్ణయించారు.
Latest News