by సూర్య | Fri, Oct 25, 2024, 02:59 PM
కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద ఇచ్చే రుణ పరిమితిని రెండింతలు చేసింది. ఈ స్కీం కింద ఇప్పటి వరకు రూ.10 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. దీనిని రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు.బడ్జెట్ ప్రవేశపెట్టిన 2024 జులై 23 నుంచి ఇది అమలులోకి వచ్చినట్లు తెలిపారు. ఆర్థిక మద్దతు, కొత్త వ్యాపారాల అభివృద్ధి, విస్తరణకు మద్దతు ఇవ్వడం పీఎంఎంవై ప్రధాన ఉద్దేశం. ఈ స్కీంను 2015లో మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. సమీప బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి ముద్ర లోన్లు వస్తాయి.
Latest News