by సూర్య | Fri, Oct 25, 2024, 01:56 PM
ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్‌ల బుకింగ్స్ ప్రారంభం అవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకు మొదటి సిలిండర్ ఎప్పుడైనా తీసుకోవచ్చన్నారు. ఆధార్, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. సిలిండర్ అందిన 48 గంటల్లోపు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని వెల్లడించారు.
Latest News