టీటీడీ ఛైర్మన్ పదవి అలాంటి వారికా..?

by సూర్య | Thu, Oct 24, 2024, 09:02 PM

మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా? అని కూటమి సర్కార్‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి స‌ర్కార్‌ను సూటిగా ప్ర‌శ్నించింది. ఈ క్రమంలో డ్రగ్స్‌ దందాలో కేసులకు సంబంధించి సాక్ష్యాలను, కీలక విషయాలను ఎక్స్ వేదిక‌గా వెలుగులోకి తెచ్చింది. వైయ‌స్ఆర్ సీపీ ట్విట్టర్‌ వేదికగా.. ‘మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాని నడిపేవారికి టీటీడీ ఛైర్మన్ పదవులా?. గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్‌ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతూ దొరికిన ఎల్లో న్యూస్‌ ఛానల్ అధినేత.. సాక్ష్యాలివిగో!’ అంటూ వివరాలను వెల్లడించింది.  రాష్ట్ర పోలీసు విభాగం కొన్నాళ్లుగా మాదకద్రవ్యాల క్రయ విక్రయాలను తీవ్రంగా పరిగణిస్తోంది.


ఒకప్పుడు ఏదైనా కేసులో దొరికిన డ్రగ్‌ పెడ్లర్‌ వద్దే దర్యాప్తు, విచారణ ఆగిపోయేది. తద్వారా మాదకద్రవ్యాల దందాకు కళ్లెం పడట్లేదని భావించిన పోలీసు విభాగం కొత్త పంథా అనుసరించడం మొదలెట్టింది. డ్రగ్స్‌ విక్రేతలు, ఖరీదు చేసే వారితో పాటు అనుమానితులకు సంబంధించిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దీనికోసం ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం సైతం సమకూర్చుకుంది. ఏదైనా ఓ కేసులో డ్రగ్‌ సప్లయర్, పెడ్లర్, కన్జ్యూమర్లతో పాటు వీరితో సంబంధాలు కలిగి ఉన్న వారి వివరాలను ఆద్యంతం పరిశీలిస్తోంది. ఆయా వివరాలతో ప్రత్యేకంగా డేటాబేస్‌ సైతం రూపొందిస్తోంది. దాన్ని కేంద్రం ఆదీనంలోని క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ నెట్‌వర్క్‌ అండ్‌ ట్రాకింగ్‌ సిస్టంతో (సీసీటీఎన్‌ఎస్‌) అనుసంధానించింది అని మండిపడ్డారు.  

Latest News

 
నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. ఈసారి వీటిపైనా ప్రధానంగా చర్చ Sun, Oct 27, 2024, 11:32 PM
తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్‌లకు పోస్టింగ్.. ఆమ్రపాలికి ఏ పోస్ట్ అంటే Sun, Oct 27, 2024, 11:31 PM
పవన్ కళ్యాణ్‌ను కలిసిన తమిళ డైరెక్టర్.. కార్యాలయానికి వెళ్లి మరీ Sun, Oct 27, 2024, 11:28 PM
జగన్ నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడుతో కలిసి షర్మిల పనిచేస్తున్నారు: విజయసాయిరెడ్డి Sun, Oct 27, 2024, 09:12 PM
చోడవరం: సాగునీటి వనరుల అభివృద్ధి ఏది? Sun, Oct 27, 2024, 08:50 PM