విజయనగరం జిల్లాలో పర్యటించిన జగన్

by సూర్య | Thu, Oct 24, 2024, 09:01 PM

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అయితే వైయ‌స్‌ జగన్‌ గుర్ల పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. వైయ‌స్ జగన్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరాగా.. వారిని అదుపు చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు.


జనాల తోపులాటలో షామియానాలు చిరిగిపోయాయి. జనాల తోపులాటతో వైయ‌స్ జగన్ మీడియా సమావేశానికి కొంత సేపు అంతరాయం ఏర్పడించింది. దీంతో పోలీసులు వైపల్యంపై  వైయ‌స్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన జనాలను పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఎలా అని మండిపడ్డారు. పోలీసుల నుంచి సహకారం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు మీడియాతో మాట్లాడుతుంటే.. కనీసం భద్రత కల్పించపోతే పోలీసులు ఎలా పనిచేస్తుస్తున్నారని ప్రశ్నించారు. 

Latest News

 
నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. ఈసారి వీటిపైనా ప్రధానంగా చర్చ Sun, Oct 27, 2024, 11:32 PM
తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్‌లకు పోస్టింగ్.. ఆమ్రపాలికి ఏ పోస్ట్ అంటే Sun, Oct 27, 2024, 11:31 PM
పవన్ కళ్యాణ్‌ను కలిసిన తమిళ డైరెక్టర్.. కార్యాలయానికి వెళ్లి మరీ Sun, Oct 27, 2024, 11:28 PM
జగన్ నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడుతో కలిసి షర్మిల పనిచేస్తున్నారు: విజయసాయిరెడ్డి Sun, Oct 27, 2024, 09:12 PM
చోడవరం: సాగునీటి వనరుల అభివృద్ధి ఏది? Sun, Oct 27, 2024, 08:50 PM