జెన్సన్ హువాంగ్ తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ముంబయిలో భేటీ

by సూర్య | Thu, Oct 24, 2024, 07:14 PM

ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంప్యూటింగ్ సంస్థ ఎన్ విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు ముంబయిలో భేటీ అయ్యారు. ఏపీ పాలనావ్యవహారాల్లో వేగవంతమైన, మెరుగైన సేవలకు ఏఐ టెక్నాలజీని వినియోగించాలన్నది తమ అభిమతం అని లోకేశ్ పేర్కొన్నారు. అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఏఐ యూనివర్సిటీకి సలహాలు, సూచనలు ఇచ్చి సహకరించాల్సిందిగా జెన్సన్ హువాంగ్ ను మంత్రి లోకేశ్ కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన హువాంగ్ రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా అంతర్జాతీయంగా ఎటువంటి విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోబోతున్నాయో వివరించారు. కాగా, స్పీచ్ రికాగ్నిషన్, మెడికల్ ఇమేజింగ్, సప్లయ్ చైన్ మేనేజ్ మెంట్ సంస్థల్లో ఏఐ వినియోగానికి అవసరమైన కంప్యూటింగ్ పవర్ టూల్స్, అల్గారిథమ్ లను ఎన్ విడియా అందిస్తోంది. ఇటీవల బ్లూమ్ బర్గ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎన్ విడియా 3.5 ట్రిలియన్ల మార్కెట్ విలువ కలిగి ఉండగా, కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన జెన్సన్ హువాంగ్‌ ప్రపంచంలో 11వ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు.

Latest News

 
జగన్ నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడుతో కలిసి షర్మిల పనిచేస్తున్నారు: విజయసాయిరెడ్డి Sun, Oct 27, 2024, 09:12 PM
చోడవరం: సాగునీటి వనరుల అభివృద్ధి ఏది? Sun, Oct 27, 2024, 08:50 PM
ఎస్ కోట: ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు ఎంపికైన వినయ్ Sun, Oct 27, 2024, 08:45 PM
సోంపేట రైల్వేస్టేషన్ ను విశాఖ రైల్వే జోన్ లో విలీనం చేయాలి Sun, Oct 27, 2024, 08:39 PM
ఆముదాలవలస: కుమ్మరివీధిలో మురుగునీరుతో అవస్థలు Sun, Oct 27, 2024, 08:37 PM