అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం హర్షం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

by సూర్య | Thu, Oct 24, 2024, 06:34 PM

మొత్తం 57 కిలోమీటర్ల మేర... రూ.2,245 కోట్ల వ్యయంతో అమరావతి అనుసంధాన రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోణంలోంచి చూస్తే అమరావతి రైల్వే లైన్ ఎంతో అవసరం అని అన్నారు. అమరావతి రైల్వే కనెక్టివిటీ లైన్ కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నాలుగేళ్ల సమయం పడుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర బ్రిడ్జి కూడా నిర్మాణం జరుపుకుంటుందని, ఈ కొత్త రైల్వే లైన్ పూర్తయితే అమరావతికి దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో కనెక్టివిటీ ఏర్పడుతుందని పవన్ కల్యాణ్ వివరించారు. ఇది ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతమిస్తుందని పేర్కొన్నారు. మచిలీపట్నం-కృష్ణపట్నం-కాకినాడ పోర్టులను కూడా అనుసంధానం చేసేలా ఈ ప్రాజెక్టు తీసుకురావడం హర్షణీయమని అన్నారు.

Latest News

 
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే Sat, Oct 26, 2024, 11:48 PM
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ Sat, Oct 26, 2024, 11:48 PM
ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. టాలెంట్ చూపెట్టిన డ్రైవరన్న Sat, Oct 26, 2024, 11:46 PM
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్ Sat, Oct 26, 2024, 10:16 PM
తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. స్వయంగా రంగంలోకి దిగిన ఈవో Sat, Oct 26, 2024, 10:14 PM