వాతావరణ అప్ డేట్స్

by సూర్య | Wed, Oct 23, 2024, 08:08 PM

తూర్పుమధ్య బంగాళాఖాతంలో బలమైన తుపానుగా మారిన ‘దానా’ ముంచుకొస్తోంది. తీరం దాటనున్న నేపథ్యంలో ఆందోళన కలిగిస్తోంది. ప్రభావితం కానున్న రాష్ట్రాలు ముమ్మర ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌పై పాక్షిక ప్రభావం ఉండనుండడంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ఇవాళ (బుధవారం) ప్రకటన విడుదల చేసింది. దానా తుపాను రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని, గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా కదిలిందని వెల్లడించింది.


ఈ తుపాను గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా, ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటనుందని పేర్కొంది. ఈ తుపాను ప్రస్తుతానికి పారాదీప్‌కు (ఒడిశా) 520 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 600 కిలోమీటర్లు, ఖేపుపరాకు (బంగ్లాదేశ్) 610 కిలోమీటర్ల దూరంలో కదులుతోందని వివరించింది. కాగా తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం నుంచి గంటకు 80-100 కి.మీ. వేగంతో వీస్తాయని తెలిపింది. ఇక రేపు (గురువారం) రాత్రి నుంచి 100-110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Latest News

 
సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన Sat, Oct 26, 2024, 01:49 PM
ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ Sat, Oct 26, 2024, 11:50 AM
కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారిగా జే వెంకట్రావు Sat, Oct 26, 2024, 11:32 AM
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన Sat, Oct 26, 2024, 11:07 AM
ఆధ్యాత్మిక బస్సు యాత్ర ప్రారంభం Sat, Oct 26, 2024, 10:23 AM