వైభవంగా పైడిమాంబ తెప్పోత్సవం

by సూర్య | Wed, Oct 23, 2024, 08:04 PM

విజయనగరం జిల్లాలో పైడిమాంబ తెప్పోత్సవం కనులవిందుగా సాగింది. సిరిమానోత్సవాల్లో భాగంగా ఏటా సిరిమాను ఊరేగింపు జరిగిన మరుసటి మంగళవారం తెప్పోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా తెప్పోత్సవం తంతు వైభవంగా జరిగింది. తొలుత పైడిమాంబ ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో వనంగుడి నుంచి ఊరేగింపుగా తెప్పోత్సవం జరిగే ప్రాంతానికి తీసుకొచ్చారు. నిర్దేశించిన సమయానికి అమ్మవారిని విద్యుత్‌ దీపాలతో అలంకరించిన తెప్పపై ఆశీనులు చేశారు. అనంతరం మూడు పర్యాయాలు పెద్ద చెరువులో పైడిమాంబ విహరించారు. ఆ సమయంలో పెద్ద చెరువు చుట్టూ వున్న భక్తులు జై జై పైడిమాంబ అంటూ నామస్మరణ చేశారు.

Latest News

 
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే Sat, Oct 26, 2024, 11:48 PM
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ Sat, Oct 26, 2024, 11:48 PM
ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. టాలెంట్ చూపెట్టిన డ్రైవరన్న Sat, Oct 26, 2024, 11:46 PM
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్ Sat, Oct 26, 2024, 10:16 PM
తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. స్వయంగా రంగంలోకి దిగిన ఈవో Sat, Oct 26, 2024, 10:14 PM