ఈనెల 24 నుంచి ఉచిత గ్యాస్‌ బుకింగ్‌కు సిద్ధం

by సూర్య | Wed, Oct 23, 2024, 07:59 PM

కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం అమలుకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 24న ఉచిత గ్యాస్‌ బుకింగ్‌కు సిద్ధం చెయ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో అర్హులకు సంబంధించిన విధివిధానాలపై అధికారులు, మహిళలు ఎదురు చూస్తున్నారు. ఏడాదికి మూడు సిలిండర్లను 4నెలలకు ఒకసారి బుక్‌ చేసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎలా నమోదు చేసుకోవాలనేదానిపై సూచనలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 5.67 లక్షల మంది గ్యాస్‌ కనెక్షన్‌దారులకు ప్రయోజనం కలగనుంది. తెలుపు రంగు రేషన్‌కార్డుదారులకు మాత్రమే ఉచిత గ్యాస్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.


అధికారులు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ ధర దాదాపు వెయ్యి రూపాయ లకు చేరువలో ఉన్న నేపథ్యంలో ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్ల వల్ల పేద, మధ్య తరగతి వారికి ఎంతో ఉపయోగకరం. దీపావళి నుంచి ఈ పథ కం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తో మహిళల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఈ పథకం అమలుపై పౌర సంబంధాల శాఖ అధికారులకు ఎటువంటి విధివిధానాలు సూచించలేదు. ఈనెల 24 నుంచి గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌చేసుకునేలా ఏజెన్సీలను సిద్ధం చెయ్యాలని ముఖ్యమంత్రి సూచించిన నేపథ్యంలో గ్యాస్‌ బుక్‌చేసుకునేందుకు మహిళలు ఉత్సాహం చూపిస్తున్నారు. అక్టోబరులో ఒక సిలిండర్‌ బుక్‌ చేసుకుంటే దానికి సంబంధించిన సొమ్మును లబ్ధిదారులు ముందుగా చెల్లించలవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాలో జమ అయిన రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత నగదు జమ చేస్తారని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం, విధివిధానాలు వస్తే తప్ప తాము వివరాలు చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు గ్యాస్‌ బుకింగ్‌కు ఇంకా రెండు రోజులు గడువున్న నేపథ్యంలో ఆదేశాలపై అధికారులు ఎదురుచూస్తున్నారు.

Latest News

 
జగన్ నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడుతో కలిసి షర్మిల పనిచేస్తున్నారు: విజయసాయిరెడ్డి Sun, Oct 27, 2024, 09:12 PM
చోడవరం: సాగునీటి వనరుల అభివృద్ధి ఏది? Sun, Oct 27, 2024, 08:50 PM
ఎస్ కోట: ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు ఎంపికైన వినయ్ Sun, Oct 27, 2024, 08:45 PM
సోంపేట రైల్వేస్టేషన్ ను విశాఖ రైల్వే జోన్ లో విలీనం చేయాలి Sun, Oct 27, 2024, 08:39 PM
ఆముదాలవలస: కుమ్మరివీధిలో మురుగునీరుతో అవస్థలు Sun, Oct 27, 2024, 08:37 PM