పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి

by సూర్య | Wed, Oct 23, 2024, 07:59 PM

గ్రామ సభల ద్వారా గ్రామాల్లో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ తెలిపారు. వెంకట్రామన్నగూడెంలో మంగళవారం రెవెన్యూ గ్రామసభలో ఆయన మాట్లాడుతూ నిర్వీర్యమైన గ్రామాల్లో జవసత్వా లు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం పల్లె పండుగలు తెచ్చి సర్పంచ్‌లకు ఊతమిచ్చిందన్నారు. అనంతరం ఆర్డీవో భవాని శంకరి గ్రామంలో భూముల రీసర్వేపై సమస్యలను స్వీకరించారు.


తహసీల్దార్‌ సునీల్‌కుమార్‌, సర్పంచ్‌ పి.అంజూష పాల్గొన్నారు. రైతుల భూ సంబంధ సమస్యలు పరిష్కారమే గ్రామ రెవెన్యూ సభల లక్ష్యమని తహసీల్దార్‌ అశోక్‌ వర్మ అన్నారు. మంగళవారం తేతలి పంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ గ్రామసభ నిర్వహిం చారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో అత్తిలి తహసీల్దారర దశిక వంశీ ఆధ్వర్యంలో, ఇరగవరం మండలం ఏలేటిపాడు, అయితంపూడి గ్రామాల్లో తహసిల్దార్‌ ఎం సుందరరాజు ఆధ్వర్యంలో 27 ఫిర్యాదులు స్వీకరించారు.అలానే పెన్నాడ గ్రామంలో గ్రామ సర్పంచ్‌ అనూష ఆధ్వర్యంలో రీసర్వేపై గ్రామసభ నిర్వహించారు. వచ్చేనెల రెండో తేదీవరకు రీసర్వే లో లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు అవకాశం ఉందన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌ సూర్యనా రాయణరాజు, సర్వేయర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Latest News

 
నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. ఈసారి వీటిపైనా ప్రధానంగా చర్చ Sun, Oct 27, 2024, 11:32 PM
తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్‌లకు పోస్టింగ్.. ఆమ్రపాలికి ఏ పోస్ట్ అంటే Sun, Oct 27, 2024, 11:31 PM
పవన్ కళ్యాణ్‌ను కలిసిన తమిళ డైరెక్టర్.. కార్యాలయానికి వెళ్లి మరీ Sun, Oct 27, 2024, 11:28 PM
జగన్ నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడుతో కలిసి షర్మిల పనిచేస్తున్నారు: విజయసాయిరెడ్డి Sun, Oct 27, 2024, 09:12 PM
చోడవరం: సాగునీటి వనరుల అభివృద్ధి ఏది? Sun, Oct 27, 2024, 08:50 PM