ఏపీ మీదుగా నడిచే రైళ్లకు అదనపు బోగీలు

by సూర్య | Fri, Jul 26, 2024, 07:50 PM

ఏపీలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం భువనేశ్వర్‌-ముంబై-భువనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు జనరల్‌ బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేశారు. 15-11-2024 నుంచి సీఎస్టీ ముంబై-భువనేశ్వర్ (11019) రైలుకు.. 17-11-24 నుంచి భవనేశ్వర్‌-సీఎస్టీ ముంబై(11020) రైలుకు రెండు అదనపు జనరల్‌ బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రైలులో పెంచిన జనరల్ బోగీలతో కలిపి 7 స్లీపర్, 6 థర్డ్ ఏసీ, 4 జనరల్, 2 సెకండ్ ఏసీ, 1 మోటారు కారు బోగీ, 1 ఏసీ ప్యాంట్రీ కార్, 1 సెకండ్ సిట్టింగ్ కమ్ లగేజ్/దివ్యాంజగన్ బోగీలతో నడవనుంది.


 మరోవైపు చెన్నై సెంట్రల్, సంత్రాగచ్చి మధ్య ఒక వైపు అన్‌రిజర్వుడ్‌ ప్రత్యేక రైలు నడపనున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలియజేశారు. ఈనెల 25వ తేదీ రాత్రి 11.45 గంటలకు ఎంజీఆర్‌ చెన్నైసెంట్రల్‌-సంత్రాగచ్చి (02842) అన్‌ రిజర్వుడ్‌ ప్రత్యేక రైలు.. చెన్నైలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.54 గంటలకు దువ్వాడ చేరకుంటుందని.. అక్కడి నుంచి బయల్దేరి 1.59 గంటలకు వెళ్లిపోతుంన్నారు.


భావనగర్‌ నుంచి కాకినాడ పోర్టు రైలు(12756) దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు. ట్రాఫిక్‌ మరమ్మతుల కారణంగా.. ఆగస్టు 3, 10, 17, 24, 31 తేదీల్లో ఐదు రోజులపాటు విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడవోలుగా మీదుగా మళ్లించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి ఈ రైలు విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా నడుస్తోంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మూడో రైల్వే లైన్ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు కారణంగా రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రైళ్ల రద్దుకు సంబంధించి అధికారులు ప్రకటనను విడుదల చేశారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM