టెక్ మహీంద్రా క్యూ1 ఫలితాలు,,23 శాతం పెరిగిన కంపెనీ నికర లాభం

by సూర్య | Thu, Jul 25, 2024, 11:22 PM

దేశంలోని టాప్-5 టెక్ కంపెనీల్లో ఒకటైన టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 ఏప్రిల్- జూన్ త్రైమాసిక ఫలితాలను గురువారం మార్కెట్లు ముగిసిన తర్వాత ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 23 శాతం వృద్ధితో రూ.851.5 కోట్లుగా నమోదు చేసినట్లు తెలిపింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ. 692.5 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. అయితే, దేశంలోని ఐదో అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా కొనసాగుతున్న టెక్ మహీంద్రా ఆపరేషన్స్ రెవెన్యూ ఈ తొలి త్రైమాసికంలో 1.2 శాతం మేర తగ్గి రూ. 13,006 కోట్లుగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే సమయంలో ఆపరేషన్స్ రెవెన్యూ రూ. 13,159 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది.


 మరోవైపు.. టెక్ మహీంద్రా రెవెన్యూ 1559 మిలియన్ డాలర్లుగా నమోదు కాగా గతేడాదితో పోలిస్తే 2.6 శాతం మేర పడిపోయింది. స్థిర కరెన్సీలో చూసుకుంటే 1.2 శాతం మేర పడిపోయింది. అలాగే టెక్ మహీంద్రా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 1.9 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. ఆపరేషన్స్ విషయానికి వస్తే కంపెనీ ఆదాయం వడ్డీలు, ట్యాక్సులు, మినహాయింపు, ఈబీఐటీడీఏకు ముందు చూసుకుంటే 16.9 శాతం పెరిగి రూ. 1564 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది.


కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత ఐటీ ఉద్యోగులను తొలగించడమే తప్పా నియామకాలు చేపట్టిన దాఖలాలు లేవు. అయితే, చాలా రోజుల తర్వాత ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు వచ్చినట్లు తెలుస్తోంది. టెక్ మహీంద్రాలో ఈ తొలి త్రైమాసికంలో ఉద్యోగల సంఖ్య 2,165 పెరిగి 1,47,620 కి చేరుకున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్తగా 2 వేలకుపైగా ఉద్యోగులను తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. కంపెనీలో ఉద్యోగుల వలస రేటు 10.1 శాతంగా ఉన్నట్లు తెలిపింది. అయితే అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 270 బేసిస్ పాయింట్లు మేర తగ్గినట్లు పేర్కొంది. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల్లో ట్రైనీలతో పాటు చూసుకుంటే వినియోగ శాతం 86.1 గా ఉన్నట్లు తెలిపింది.


ఈ తొలి త్రైమాసికంలో టెక్ మహీంద్రా కొత్త డీల్స్ విలువ సుమారు 534 మిలియన్ డాలర్లుగా ఉంది. అది అంతుకు ముందు త్రైమాసికం జనవరి- మార్చి 2024 చూసుకుంటే 500 మిలియన్ డాలర్లుగా ఉంది. ఏడాది క్రితం 2023- 24 తొలి త్రైమాసికంలో చూస్తే ఈ డీల్స్ విలువ 359 మిలియన్ డాలర్లు మాత్రమే.

Latest News

 
జస్ట్ 40 రోజుల్లోనే ఆ..రు..సార్లు స్నానం చేశాడు.. అయినా విడాకులు కోరితే ఎలా..? Mon, Sep 16, 2024, 10:47 PM
అమరావతి రైతులకు,,,కౌలు డబ్బులు విడుదల చేసిన ప్రభుత్వం Mon, Sep 16, 2024, 10:10 PM
వరదబాధితులకు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు ఉచితంగా,,,,టీడీపీ నేత గొప్ప మనసు.. Mon, Sep 16, 2024, 10:06 PM
చంద్రబాబు, లోకేశ్ లపై జగన్ విమర్శనాస్త్రాలు Mon, Sep 16, 2024, 09:54 PM
ఆపరేషన్ ప్రకాశం బ్యారేజీ.. ప్లాన్ 5 అయినా సక్సెస్ అవుతుందా Mon, Sep 16, 2024, 09:52 PM