ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో వర్షాలు

by సూర్య | Wed, Jul 10, 2024, 09:31 PM

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తరకోస్తా తీరం మీద ఉన్న ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది అంటున్నారు. ఉత్తర కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీస్తాయి అంటున్నారు. రాష్ట్రంలో ఇవాళ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. అక్కడక్కడా భారీగా వానలకు అవకాశం ఉందంటున్నారు.


నంద్యాల జిల్లా ఆత్మకూరులో 85.8 మిల్లీ మీటర్లు, కృష్ణా జిల్లా అవనిగడ్డలో 58.6, నంద్యాల జిల్లా పీ పల్లిలో 50.6, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 40, పార్వతీపురం మన్యం జిల్లా బాలాజీపేటలో 37.2, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో 34.2, ప్రకాశం జిల్లా రచర్లలో 33.2, కృష్ణా జిల్లా ముసులిపట్నంలో 32.9, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 28.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.


మరోవైపు తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం, గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంటున్నారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంటున్నారు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు.


 

Latest News

 
స్వామి వివేకానంద ప్రేరణలు దేశానికి గర్వకారణం Sun, Jan 12, 2025, 11:01 PM
సంక్రాంతికి ఇస్తా అన్న, సంతోషం ఏదయ్యా? Sun, Jan 12, 2025, 11:00 PM
ప్రభుత్వ పథకాల అమలుకు ప్రభుత్వం మంగళం Sun, Jan 12, 2025, 10:59 PM
ప్రచారం తప్ప చేసింది ఏమైనా ఉందా...? Sun, Jan 12, 2025, 10:58 PM
తిరుమల ఆలయ పవిత్రతను కూటమి నేతలు దెబ్బతీశారు Sun, Jan 12, 2025, 10:58 PM