రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by సూర్య | Wed, Jul 10, 2024, 02:25 PM

రోడ్డు ప్రమాదంలో విశాఖ వాసి మృతి చెందిన ఘటన పూసపాటిరేగ మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ సన్యాశినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా మర్రిపాలెం గ్రామానికి చెందిన విశ్రాంత పశువైద్యాధికారి పక్కి నర్శింగరావు(65) కారులో సోమవారం అతడి స్వగ్రామమైన శ్రీకాకుళం వెళ్లి మంగళవారం సాయంత్రం తిరిగి శ్రీ కాకుళం నుంచి విశాఖపట్నం కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై పూస పాటిరేగ మండలం చోడమ్మఅగ్రహారం పంచాయతీ పరిధి సీపీ పరిశ్రమ వద్దకు వచ్చేసరికి కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అదే దిశలో ముందు వెళ్తు న్న లారీని కారు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో లారీ వెనుకభాగంలోకి కారు చొచ్చుకుపోవడంతో కారులో ప్రయాణిస్తున్న న ర్సింగరావు అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవరుకు గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆసు పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలించగా ఎస్‌ఐ సన్యాశినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
తిరుపతిలో హోటల్స్ కు బాంబు బెదిరింపు కాల్స్ కలకలం Wed, Oct 30, 2024, 12:18 PM
అద్దంకి: ఘనంగా జాతీయ సమైక్య దినోత్సవ కార్యక్రమం Wed, Oct 30, 2024, 11:44 AM
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ Wed, Oct 30, 2024, 11:21 AM
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం Wed, Oct 30, 2024, 11:07 AM
తిరుపతి నుంచి రామ జన్మ భూమి అయోధ్యకు రథయాత్ర ప్రారంభం Wed, Oct 30, 2024, 10:16 AM