మద్య నిషేధం చేస్తానని, ఎందుకు చెయ్యలేదు

by సూర్య | Sat, Apr 27, 2024, 05:06 PM

వైసీపీ 2019 ఎన్నికల సందర్భంగా చేసిన ప్రధాన హామీల్లో ఒకటి మధ్య నిషేధం. ఆ హామీని నెరవేర్చని వైసీపీ.. పిచ్చి పిచ్చి బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తీసేస్తోంది. నిషేధం దేవుడెరుగు.. ప్రాణాలు పోయే మందుతాగలేమని బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం మద్య నిషేధంపై సీఎం జగన్‌ను ఎక్స్ లో సూటిగా ప్రశ్నించారు. మద్య నిషేధం చేయకుండా వైసీపీ ప్రజలను ఓట్లు ఎలా అభ్యర్థిస్తుంది అని అన్నారు. "మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నావ్. వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా నీకు గౌరవం ఉంటే... 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతా అన్న నువ్వు...ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని విడుదల చేసి, ఓట్లు అడుగుతున్నావు?" అని సీబీఎన్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

Latest News

 
ఏపీ రెయిన్ అలెర్ట్ Thu, May 09, 2024, 11:43 PM
రేపు ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు Thu, May 09, 2024, 10:15 PM
ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఎట్టిపరిస్థితుల్లోనూ కొనసాగించాల్సిందే : సీఎం జగన్ Thu, May 09, 2024, 09:45 PM
రూ.8.39 కోట్ల నగదు సీజ్ Thu, May 09, 2024, 06:20 PM
రోడ్ షో నిర్వహించిన టిడిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు Thu, May 09, 2024, 06:16 PM