శ్రీశైలంలో ఘనంగా కుంభోత్సవం

by సూర్య | Fri, Apr 26, 2024, 03:15 PM

శ్రీశైలంలో లోకళ్యాణార్ధం శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి ఆలయ ఈవో పెద్దిరాజు , అధికారులు వార్షిక కుంభోత్సవం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలో తొలి విడత సాత్వికబలిగా కొబ్బరి, నిమ్మ, గుమ్మడికాయలు సమర్పించారు. సాయంత్రం శ్రీస్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది. ఈ సందర్బంగా ఆలయద్వారాలు మూసివేస్తారు. అన్నం కుంభరాశిగా పోసి స్త్రీ వేషంలో ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి ఇచ్చి.. తొమ్మిది రకాల పిండివంటలతో మహానివేదన చేస్తారు. తర్వాత రెండో విడత సాత్వికబలి సమర్పణ చేస్తారు. అనంతరం భక్తులను అమ్మవారి నిజరూప దర్శనానికి అధికారులు అనుమతి ఇస్తారు. కాగా శ్రీశైలం క్షేత్రంలో జీవహింస నిషిద్ధం కారణంగా జంతు, పక్షు బలులు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మాడవీధులు, అంకాళమ్మ, పంచమఠాలు, మహిషాసురమర్ధిని ఆలయాల గట్టి బందోబస్తు ఏర్పాలు చేశారు. ఈరోజు సుండిపెంటలో మద్యం దుకాణాలు నిలిపివేసేలా జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.

Latest News

 
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM
ఈ నెల 11న కడపలో పర్యటించనున్న రాహుల్ Wed, May 08, 2024, 08:28 PM