వైసీపీ బీజేపీతో అంటకాగుతుంది

by సూర్య | Thu, Apr 25, 2024, 06:45 PM

 ఎక్కువ శాతం ముస్లింలు, క్రిస్టియన్లు బీజేపీని వ్యతిరేకించడం లేదని విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ముస్లిం, క్రిస్టియన్ సోదరులతో గురువారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమికి పూర్తి మద్దతును ముస్లింలు, క్రిస్టియన్లు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ... కొందరు ముస్లింలు, క్రిస్టియన్లు బీజేపీతో ఇబ్బందులు వస్తాయని అపోహలతో ఉన్నారన్నారు. బీజేపీకి ముస్లింలు, క్రిస్టియన్లు వ్యతిరేకంగా ఉన్నారని వైసీపీ అపోహలు సృష్టిస్తోందని మండిపడ్డారు. దొంగ చాటుగా వైసీపీ బీజేపీతో కలసి వెళ్తుందని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ ఉంటే... కేంద్రంలో బీజేపీ ప్రవేశపెడుతున్న బిల్లులకు వైసీపీ ఎందుకు మద్దతు తెలుపుతుందని ప్రశ్నించారు. కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికి, స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ బీజేపీతో అంటకాగుతుందని విమర్శించారు. అప్పుల పాలైన ఏపీని బాగు చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరమని.. అందుకే ఆ పార్టీతో కలిసి ముందుకెళ్తున్నామని అన్నారు. ముస్లింలు, క్రిస్టియన్ సోదరుల్లో ఉన్న అపోహలపై ఈ సమావేశంలో వివరణ ఇచ్చామన్నారు. వైసీపీ పాలనలో క్రైస్తవ సోదరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ధ్వజమెత్తారు. ప్రశాంతమైన విశాఖ నగరాన్ని వైసీపీ నాశనం చేసిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని, విశాఖను కాపాడుకోవటానికి ముస్లింలు, క్రిస్టియన్ సోదరులు తమ పూర్తి మద్దతు కూటమికి తెలియజేశారని శ్రీభరత్ పేర్కొన్నారు.

Latest News

 
టీడీపీలోకి మాజీ సర్పంచ్ కుమారుడు Wed, May 08, 2024, 04:21 PM
వైసిపి పాలనతో విసిగిపోయిన ప్రజలు - ఏరీక్షన్ బాబు Wed, May 08, 2024, 04:19 PM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 04:15 PM
పర్చూరు నియోజకవర్గంలో ధన ప్రవావం Wed, May 08, 2024, 04:13 PM
అన్ని వర్గాలపై పట్టు సాధించేలా కొండయ్య ప్రచారం Wed, May 08, 2024, 04:10 PM