వర్మను చట్టసభల్లోకి పంపిస్తా

by సూర్య | Thu, Apr 25, 2024, 06:40 PM

పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పవన్‌ వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే వర్మను చట్టసభల్లోకి పంపి ఆయ నకు తగిన గౌరవం లభించేలా చేసే బాధ్యత తనదన్నారు. ‘పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తన సీటును నా కోసం త్యాగం చేశారు. ఆయనకు నా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుతున్నా. భవిష్యత్తులో ఆయన ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరుకుంటున్నా. దానికి నా కృషి కూడా ఉంటుంది’ అని పవన్‌కల్యాణ్‌ తెలిపారు. నామినేష న్‌కు భారీగా టీడీపీ శ్రేణులు రావడం ఆనందంగా ఉందన్నారు.కలిసి పనిచేయడంతో విజ యం సాధించడం సులువని పేర్కొన్నారు. వర్మతో పాటు మరికొందరు నేతలను పవన్‌ ఆలింగనం చేసు కున్నారు.తమది మూడు పార్టీల హామీ అని, జగన్‌లా ఒక పార్టీ హామీ కాదన్నారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లా డుతూ చంద్రబాబు ఆదేశాల తో పవన్‌ను భారీ మెజార్జీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన స్థానికేతరుడని వైసీపీ ఆరోపి స్తున్నా రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడి నుంచైనా పోటీచేస్తార న్నారు.ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిని వంగా గీత ఐదేళ్లలో ఏరోజు పిఠాపురం రాలేదని ధ్వజ మెత్తారు. అనంతరం ఉప్పాడ సెంటర్‌ నుంచి గోర్స, కొమరగిరి మీదుగా పిఠాపురం- గొల్లప్రో లు బైపాస్‌ మీదుగా చేబ్రోలులోని తన ఇంటికి పవన్‌ చేరుకున్నారు.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM