వైఎస్ జగన్ మీద రాళ్ల దాడి.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

by సూర్య | Sun, Apr 14, 2024, 04:11 PM

సీఎం వైఎస్ జగన్ మీద జరిగిన దాడి ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అధికార, ప్రతిపక్షాలు దీనిపై మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్లదాడిపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ మీద పక్కా ప్లాన్ ప్రకారం దాడి జరిగిందని కొడాలి నాని ఆరోపించారు. "జగన్ మీద జరిగింది రాయి దాడి కాదు. చాలా పకడ్బందీగా వ్యూహం ప్రకారం, గురిచూసి కొట్టాలని చూశారు. సీఎం జగన్ కదలడం వలన గురి తప్పి కన్ను వద్ద తగిలింది. దేవుడు దీవెనలు, ప్రజల ఆశీస్సులతోనే సీఎం జగన్ గాయంతో బయటపడ్డారు. అయితే దానిని ఖండించాల్సిన పెద్దలు.. సంస్కారహీనంగా జగనే దాడి చేయించుకున్నారని మాట్లాడుతున్నారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటివి చేస్తున్నారు. దేశంలోని పది సంస్థలు సర్వే చేస్తే 9 సంస్థల సర్వేల్లో 125 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు స్థానాలు వస్తాయని చెప్తున్నాయి. అందుకే రాజకీయంగా జగన్‌ను ఎదుర్కోలేని రాజకీయ నిరుద్యోగులు, విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం ఓర్చుకోలేని వర్గాలు జగన్ మీద దాడి చేశాయి" అని కొడాలి నాని ఆరోపించారు.


" సీఎం మీద దాడి జరిగిందంటే దీనివెనుక చాలా మంది పెద్దలున్నారు. నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో జరిగిన సభలో జగన్‌ను రాళ్లతో కొట్టాలని చంద్రబాబు అన్నారు. వీడియోలు నా వద్ద ఉన్నాయి. చంద్రబాబు మాటలు విని కొంతమంది జగన్‌ను చంపడానికి ప్రయత్నించారు. ఎంత వేగంగా వస్తే జగన్‍‌కు తగిలి మళ్లీ వెల్లంపల్లికి రాయి తగిలి అతనికి కూడా గాయమవుతుందా?. కరెంట్ తీసేశారని టీడీపీ వాళ్లు అంటున్నారు. ప్రధాని, సీఎం స్థాయి వ్యక్తులు ర్యాలీగా వెళ్తున్నప్పుడు కరెంట్ తీయడం సహజం. వైర్లు తగిలి ప్రమాదం జరుగుతుందని కరెంట్ తీసేస్తారు. ఇది టీడీపీ వాళ్లకు తెలియదా? చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికలప్పుడు దాడి జరిగింది. ఇప్పుడు జరిగింది"అని కొడాలి నాని ఆరోపించారు.


ఇక వైఎస్ జగన్‌కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక అంతమొందించాలనే ప్రయత్నం జరుగుతోంది. జగన్‌కు బ్యాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలి. 420 గాళ్లకు, పనికిమాలిన వెధవలకు సెక్యూరిటీ ఇస్తున్నారు. చంద్రబాబుకు ఎందుకు సెక్యూరిటీ? ఇంకో రెండు, నాలుగు ఏళ్లకో చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు ఎందుకు సెక్యూరిటీ" అంటూ కొడాలి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM